Begin typing your search above and press return to search.

5 రాష్ట్రాల ఎన్నికలు: రాజకీయ పార్టీలకు షాక్.. పోస్టల్ బ్యాలెట్ అవకాశం

By:  Tupaki Desk   |   8 Jan 2022 4:30 PM GMT
5 రాష్ట్రాల ఎన్నికలు: రాజకీయ పార్టీలకు షాక్.. పోస్టల్ బ్యాలెట్ అవకాశం
X
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రచార పర్వానికి పార్టీలు సమాయత్తమవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలుచేస్తున్న ఆంక్షలు కూడా మొదలయ్యాయి.

ఈసీ ఈసారి కఠిన నిబంధనలు పొందుపరిచింది. రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరిత్ర గల అభ్యర్థుల వివరాలను ఆయా పార్టీలు తప్పనిసరిగా వెల్లడించాలని సుశీల్ చంద్ర స్పష్టం చేశారు. దీన్ని తప్పనిసరి చేశారు. నేర చరిత్ర గల వారిని ఎన్నికల్లో ఎందుకు అభ్యర్థిగా నిలబెట్టాల్సి వచ్చిందో ప్రతీ రాజకీయ పార్టీలు వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. నేర చరితులను ఎన్నికల్లో నిలబెట్టి ప్రతి రాజకీయ పార్టీ కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తమ వెబ్ సైట్ లో పొందుపరచాలని అన్నారు. ఏ ప్రయోజనంతో వారిని నిలబెట్టారో ఓటర్లకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలను ఈసీ ఆదేశించింది.

ఇక ఎన్నికల అక్రమాలను నివారించడానికి సివిజల్ యాప్ ను ప్రవేశపెట్టింది. ప్రతీ ఓటరు కూడా తాను వినియోగించే స్మార్ట్ ఫోన్ లలో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

-పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు
ఇక కరోనా వల్ల 80.. ఆ పై వయసు గల వారికి పోస్టల్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. వీరితోపాటు వికలాంగులు, కరోనా సోకిన వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే చాన్స్ ఇచ్చారు.

ఈసారి ఎన్నికల ప్రచారం కూడా అంతా ఆన్ లైన్ లోనే జరుగుతుంది. సభలు , సమావేశాలు, ర్యాలీలపై కూడా ఆంక్షలు ఉన్నాయి. దీంతో జనంతో కలిసే అవకాశం తక్కువగా ఉంటుంది. జనవరి 15వ తేదీ వరకూ నిషేధం విధించింది. తర్వాత పరిస్థితిని బట్టి సీఈసీ తెలియజేయనుంది.