Begin typing your search above and press return to search.

మన 4జీ స్పీడు చూసి ప్రపంచం నవ్వుతోంది

By:  Tupaki Desk   |   8 Jun 2017 4:22 PM IST
మన 4జీ స్పీడు చూసి ప్రపంచం నవ్వుతోంది
X
రిలయన్స్ జియో రాకతో ఇండియాలో వచ్చిన 4జీ విప్లవం ఫలితం ఎత? పోర్ను చూసేవారి సంఖ్య 75 శాతం పెరగడం 4జీ విప్లవ ఫలితమా? కానే కాదు... 4జీ వేగం అగ్ర దేశాల స్థాయిలో ఉన్నప్పుడే దాని ఫలితాలు అందిన్లు కానీ.. 4జీ వేగంలో మనం ఎక్కడున్నాం అని ప్రశ్నించుకుంటే అధమం అనే చెప్పాలి. ప్రపంచ సగటు 4జీ వేగం కంటే మన దగ్గర వేగం మూడో వంతు తక్కువగా ఉంది. భారత్ లో ప్రస్తుతం 4జీ డౌన్ లోడ్ స్పీడ్ కేవలం 5.1 ఎంబీపీఎస్ మాత్రమే ఉన్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వెల్లడించింది. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా సగటు 4జీ డౌన్ లోడ్ స్పీడు 16.2 ఎంబీపీఎస్ గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇది ప్రపంచ సగటు 3జీ వేగం కంటే స్వల్పంగా ఎక్కువ మాత్రమేనట. అదీ సంగతి.

టెలికాం ఆపరేటర్లంతా 4జీ డాటా ఆఫర్లతో ముంచెత్తుతున్నా కూడా అసలు సంగతి చూస్తే డీలా పడాల్సిందే. డౌన్ లోడ్ స్పీడు అత్యంత దారుణంగా ఉండడమే దానికి కారణం. రిలయన్స్ జియో ఉచిత డేటా సర్వీసులతో డేటా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని, ఫలితంగా ఆర్నెల్లుగా సెకెనుకు ఒక మెగాబైట్ కంటే ఎక్కువగా డౌన్ లోడ్ స్పీడ్ ఉండడం లేదని ఓపెన్ సిగ్నల్ వంటి సంస్థలు విశ్లేషిస్తున్నాయి. రిలయన్స్ జియో దెబ్బకు ఇతర టెలికాం ఆపరేటర్లు ఎయిర్ టెల్ - వొడాఫోన్ - ఐడియా కూడా తమ డేటా ధరలను తగ్గించాయని, దీంతో డేటా సర్వీసులకు మరింత డిమాండ్ పెరగడం కూడా డౌన్ లోడ్ స్పీడ్ ఈ స్థాయిలో పడిపోవడానికి మరో కారణమని అంటున్నారు.

ఇక 4జీ డౌన్ లోడ్ స్పీడ్ లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నదెవరో తెలుసా... ఇంకెవరు సింగపూర్. ఆ తరువాత దక్షిణ కొరియాది రెండో స్థానం. పాకిస్తాన్ - శ్రీలంక దేశాల్లో 4జీ వేగం కూడా భారత్ కంటే అధికంగా ఉందట.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/