Begin typing your search above and press return to search.
మోడీ నువ్వు ఓకే కానీ..నీ పార్టీయే నచ్చట్లేదు
By: Tupaki Desk | 17 April 2018 11:33 PM ISTప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏకకాలంలో గర్వం - పరాభవం ఎదురయ్యే సందర్భం చోటుచేసుకుంది. ఆయన్ను మెచ్చుకుంటూనే...ఆయన పార్టీ అయిన బీజేపీని తూలనాడారు. ఇలా చేసింది ప్రత్యర్థులో విమర్శకులో కాదు...మాజీ ఉన్నతాధికారులు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ - జమ్ముకశ్మీర్ లోని కతువా దారుణ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. 49మంది సివిల్ సర్వీసెస్ మాజీ అధికారులు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఓ బహిరంగ లేఖ రాశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హర్ష్ మందర్ - మాజీ డీజీపీ మీరన్ బోర్వంకర్ - ప్రసారభారతి మాజీ సీఈవో జవహర్ సిర్కార్ - ముంబై మాజీ పోలీస్ కమిషనర్ జూలియో రిబీరో - రిటైర్డ్ ఐఏఎస్ - సమాచారహక్కు ఉద్యమకారిణి అరుణారాయ్ - కాగ్ మాజీ డిప్యూటీ అధికారి నిరంజన్ పంత్ - మాజీ సమాచార కమిషనర్ వజాహత్ హబీబుల్లా తదితరులు ఈ లేఖపై సంతకాలు చేశారు. ఇందులో స్వాతంత్య్రానంతరం దేశం చవిచూస్తున్న అత్యంత చీకటి సమయం ఇదేనని ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తంచేశారు.
ఆ ఉన్నతాధికారులు రాసిన లేఖ సారాంశం ఇది...`భారత రాజ్యాంగం ప్రవచించిన ప్రజాస్వామిక - లౌకికవాద - స్వేచ్ఛా విలువలు నానాటికీ క్షీణించిపోతుండడంపై ఆందోళన వ్యక్తంచేస్తూ మేం మీకు ఈ లేఖ రాస్తున్నాం. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ప్రజలకు కనీస భద్రత కూడా ఇవ్వలేకపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. పాలకపక్షం ప్రేరేపించిన ద్వేషం - భయానక వాతావరణానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నవారితో మేమూ గొంతుకలుపుతున్నాం. రాజ్యాంగ విలువలే తప్ప - ఏ రాజకీయ పార్టీతోనూ - వారి అభిప్రాయాలతోనూ మాకు సంబంధం లేదు. రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రమాణం చేసినవారు.. ప్రభుత్వాధినేతగా ఉన్న మీరు.. మీకు సంబంధించిన పార్టీ ఈ సంక్షోభ సమయంలో మేల్కొంటారని ఆశించాం. దేశంలో మైనార్టీలు - బలహీన వర్గాలు తమ బతుకులకు సంబంధించి - స్వేచ్ఛకు సంబంధించి ఆందోళనకు గురవుతున్నప్పుడు మీరు భరోసా ఇస్తారని భావించాం. కానీ మా నమ్మకం ముక్కలైంది. ప్రజలు అప్పగించిన ప్రాథమిక బాధ్యతలనూ సక్రమంగా నిర్వర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని ఉన్నావ్ - కతువా దారుణాలను చూసిన తర్వాత అర్థమైంది. నైతిక - ఆధ్యాత్మిక - సాంస్కృతిక వారసత్వ సమాజంగా ఉన్న భారతదేశం కూడా దాని విలువలను కాపాడుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు.`హిందువుల పేరిట మరొకరిని హింసించిన దారుణానికి కూడా పరోక్షంగా మద్దతివ్వడం ద్వారా మనమంతా మానవులుగా విఫలమయ్యాం. ఎనిమిదేళ్ల చిన్నారిపై కొందరు పశువుల్లా లైంగికదాడికి పాల్పడడం - ఆపై హత్యచేయడం పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో తెలియజేస్తోంది. స్వాతంత్య్రం తర్వాత దేశం చవిచూస్తున్న అత్యంత చీకటిరోజులు ఇవే`` అని మండిపడ్డారు.
ఉన్నావ్ - కతువా దారుణాల్లోని పశుత్వం - అనాగరికత.. జరిగిన దుర్మార్గపు లోతును తెలియజేస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. `ఈ రెండు ఘటనల్లో ప్రభుత్వం - వివిధ రాజకీయ పక్షాల స్పందన చాలా బలహీనంగా ఉంది. దేశంలో ఎలాంటి ఆశాకిరణం కానరాని ఈ స్థితిలో మేమంతా సిగ్గుతో తలదించుకుంటున్నాం. జిల్లాల్లో - రాష్ర్టాల్లో పనిచేస్తున్న మా సహచర యువ అధికారులు కూడా బలహీనవర్గాలకు భరోసా ఇవ్వడంలో విఫలమవడం మరింత బాధిస్తోంది. కేవలం ఆవేదనను వెళ్లగక్కేందుకే కాదు - మా ఆగ్రహాన్ని కూడా తెలియజేసేందుకే మీకు ఈ లేఖను రాస్తున్నాం. మీ పార్టీ అనుసరిస్తున్న ద్వేషపూరిత వైఖరి - విభజన రాజకీయాలు - అంగీకారయోగ్యం కాని చర్యలపై మేం ఆగ్రహంతో ఉన్నాం. కతువా ఘటనలో సంఘ్ పరివార్ శక్తులు తమ ముందుస్తు కుట్రను ఎలా పకడ్బందీగా ఆచరణలో పెడుతున్నాయో చూస్తున్నాం. సమాజాన్ని హిందూ-ముస్లింలుగా చీల్చడం ద్వారా లబ్ధిపొందిన రాజకీయ బలవంతులు తమకు మద్దతు పలుకుతారన్న ధీమా వారిలో కనిపిస్తున్నది. స్వేచ్ఛ, అధికారం లభిస్తే రాజకీయశక్తులుగా మారిన పితృస్వామ్య ఫ్యూడల్ మాఫియా ఎలా పేట్రేగిపోతుందో ఉన్నావ్ ఘటన స్పష్టంచేస్తున్నది. సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాల్సిన మీరు మౌనంగా ఉంటూ వచ్చారు. దేశంలోనూ, అంతర్జాతీయంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తిన తర్వాత తప్పని పరిస్థితుల్లో మీరు పెదవివిప్పడం మేం గమనించాం. ప్రధానమంత్రి గారూ.. ఈ రెండు ఘటనలు కాలానుగుణంగా జరిగిన నేరాలు కావు. భారతీయ సామాజిక అల్లికను, నైతిక విలువలను తీవ్రంగా దెబ్బతీసిన దారుణాలు ఇవి. ఒకదేశంగా, ఒక గణతంత్ర రాజ్యంగా నిలబడిగే సామర్థ్యం మనకు ఉందా? లేదా? అనేది ఇప్పుడు ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపైనే ఆధారపడి ఉంది` అని పేర్కొన్నారు.