Begin typing your search above and press return to search.

ఏపీ పోలీస్ శాఖలో కరోనా కలకలం

By:  Tupaki Desk   |   5 July 2020 8:20 PM IST
ఏపీ పోలీస్ శాఖలో కరోనా కలకలం
X
ఏపీ పోలీస్ శాఖలో కరోనా కలకలం చోటుచేసుకుంది. డాక్టర్లు, పారిశుధ్య కార్మికులకే కాదు.. డ్యూటీలో ఉండే పోలీసులకు కూడా కరోనా పెద్ద ఎత్తున వ్యాపిస్తోంది.

ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల వరకు సోకిన కరోనా తాజాగా పోలీసులకు విస్తరించింది. విశాఖలో రెండు రోజుల పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన డీజీపీ గౌతమ్ సవాంగ్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఏపీలో 466మంది పోలీసులు కరోనా బారిన పడ్డారని సంచలన విషయాన్ని వెల్లడించారు.

కరోనా సమయంలో క్షేత్రస్థాయిలో పోలీసులు ముందు వరుసలో నిలుస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. జూన్ 3 వరకు 45 మంది పోలీసులకు కరోనా సోకిందని.. గత నెల రోజుల్లో 421మంది పోలీసులకు కరోనా వచ్చినట్లు తెలిపారు. జూన్ 3 తర్వాత రాష్ట్రంలో కేసుల సంఖ్య బాగా పెరిగిందని సవాంగ్ తెలిపారు.

ఇలా పరిపాలనలో కీలకమైన క్షేత్రస్థాయిలో ఉండే పోలీసులు కరోనా బారిన పడడం కలకలం రేపుతోంది. శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు సైతం ప్రాణాలకు తెగించి పాల్గొంటున్నారని డీజీపీ ప్రశంసించారు.