Begin typing your search above and press return to search.

మనీలాండరింగ్ కేసులో ప్రవాస భారతీయుడికి 460 ఏళ్ల జైలు శిక్ష?

By:  Tupaki Desk   |   18 Jan 2023 5:30 PM GMT
మనీలాండరింగ్ కేసులో ప్రవాస భారతీయుడికి 460 ఏళ్ల జైలు శిక్ష?
X
ఇటీవలి కాలంలో ప్రవాసీ భారతీయులు అనేక మంది వివిధ దేశాల్లో అనేక కేసుల కింద అరెస్టవుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ లిస్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా ఉండటం గమనార్హం. అమెరికాలోని నార్త్ కరోలినాలో స్థిరపడిన ఓ తెలుగు వ్యక్తి రియల్ ఎస్టేట్ బూమ్ పేరుతో కొంతమంది వ్యక్తులను మోసగించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటూ అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది.

మనీ లాండరింగ్.. రియల్ ఎస్టేట్ ఫ్రాడ్ అభియోగాలను ఎదుర్కొంటున్న ఆ వ్యక్తికి ఏకంగా 460 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో సదరు వ్యక్తిని ఎఫ్బీఐ పోలీసులు ఇటీవల అరెస్టు చేసి విచారణను వేగవంతం చేయడంతో అసలు విషయం బయటికి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..!

కుమార్ అరుణ్ నెప్పల్లి అనే భారతీయ వ్యక్తి చాపెల్ హిల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీర్‌గా గతంలో పని చేశాడు. ఈ క్రమంలోనే నార్త్ కరోలినాలోని ఆరెంజ్ కౌంటీలో రియల్ ఎస్టేట్ బూమ్ గురించి తన వద్ద అంతర్గత సమాచారం ఉందని అమెరికన్లను నమ్మించాడు. రియల్ ఎస్టేట్లో లాభాలు చూపిస్తానంటూ ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీకి చెందిన పలువురు వ్యక్తులను మోసగించినట్లు తెలుస్తోంది.

కుమార్ అరుణ్ మాటలు నమ్మిన 12 మంది బాధితులు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు. అయితే కుమార్ మాత్రం కొత్త పెట్టుబడుల నుంచి పాత పెట్టుబడులకు డబ్బులు మళ్లించడం చేస్తున్నాడు. వీటినే చట్టబద్ధ లాభాలుగా చూపిస్తూ వారిని నమ్మించే వాడు. అయితే ఇటువంటి పథకాలను పోంజీ పథకాలుగా భావిస్తుంటారు.

కుమార్ అరుణ్ సుమారు 23 వైర్ ప్రాడ్ మరియు మనీ లాండరింగ్ అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. 23 కౌంట్ లలో ప్రతి నేరానికి 20 ఏళ్ల శిక్షను కుమార్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 23 కేసుల్లో అతడు దోషిగా తేలితే మాత్రం అతడికి ఏకంగా 460 సంవత్సరాల జైలు శిక్ష ఖరారయ్యే అవకాశం ఉంటుంది.

కుమార్ అరుణ్ 18యుఎస్సీని ఉల్లంఘించి 17 వైర్ ఫ్రాడ్‌పై అభియోగాలు ఎదుర్కొంటున్నాడు.. 1943 మరియు 18 యుఎస్సీని ఉల్లంఘించి నేరపూరితంగా ఉత్పన్నమైన ఆస్తిలో లావాదేవీలను నిర్వహించడం వంటి ఆరు నేరాలపై నార్త్ కరోలినా ఈస్ట్ డిస్ట్రిక్ట్ అటార్నీ విచారణ చేపడుతోంది. ఈ మేరకు ఎఫ్బీఐ పోలీసులకు కుమార్ నెప్పల్లిని అరెస్టు చేసి తదుపరి విచారణ కోసం అటార్నీ కార్యాలయానికి తరలించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.