Begin typing your search above and press return to search.

46 గంటల నాన్ స్టాప్ ముద్దు.. తర్వాత ఏమైందంటే?

By:  Tupaki Desk   |   14 Feb 2021 6:00 AM IST
46 గంటల నాన్ స్టాప్ ముద్దు.. తర్వాత ఏమైందంటే?
X
‘ము.. ముద్దంటే చేదా? నీకు ఆ ఉద్దేశం లేదా’ అంటూ వెంటపడే సుందరాంగులు బోలెడు మంది.. అయితే ఆ ముద్దూ మురిపెలా ఒకప్పుడు పెళ్లి తర్వాతే జరిగేవి. ఇప్పుడు పెళ్లికి ముందే అన్నీ కానిచ్చేస్తున్నారు. అయితే కరోనాతో ఈ ముద్దులకు బ్రేక్ పడింది.

కరోనా గత ఏడాది ప్రపంచాన్ని ఆవహించాక ఓ షేక్ హ్యాండ్ లేదు.. హగ్ లేదు.. ఇక ముద్దూ మురిపాలు కూడా లేకుండా పోయాయి. ఈ కరోనా మహమ్మారి చేయబట్టి సరిగ్గా రోమాన్స్ కూడా చేయడానికి భయం వేస్తోంది. భౌతిక దూరం పాటిస్తూ జనాలు నెట్టుకొస్తున్నారు.

అయితే ఇన్నాళ్లు ఇలాంటి కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా విహరించిన వారికి.. సినిమాల్లోనూ ముద్దు సీన్లు పెట్టుకున్న వారికి కరోనా బంధనాలు పెట్టేసింది. సంవత్సరం పాటు వెయిట్ చేసిన జనాలు ఇక కరోనా వచ్చినా చచ్చినా ఫర్వాలేదని కట్టుబాట్లు తెంచేసుకున్నారు.

తాజాగా థాయ్ లాండ్ కు చెందిన ఓ జంట 2011లో దాదాపు 2 రోజుల పాటు ముద్దు పెట్టుకొని రికార్డ్ సృష్టించింది. 46 గంటల 24 నిమిషాల 9 సెకన్లపాటు ముద్దు పెట్టుకొని రికార్డు సృష్టించింది.

దీనికి ముందు ఈ ముద్దు రికార్డ్ జర్మనీకి చెందిన ఓ జంట పేరిట ఉంది. 2009లో 32 గంటల పాటు ముద్దు పెట్టుకోగా ప్రస్తుతం ఆ రికార్డు చెరిగిపోయింది.