Begin typing your search above and press return to search.
తమిళనాడులో ఇళ్లు.. వాహనాలకు నిప్పు పెట్టేంత రచ్చ ఏమైంది?
By: Tupaki Desk | 3 Aug 2020 11:00 AM ISTప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనాతో విలవిలలాడుతోంది. అందుకు దేశం సైతం మినహాయింపు కాదు. ఇదిలా ఉంటే.. దీనికి భిన్నమైన పరిస్థితి తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని ఒక జిల్లాలో రెండు వర్గాల మధ్య గొడవ పెరిగి ఘర్షణగా మారటమే కాదు.. అది కాస్తా హింసాత్మక ఘటనకు కారణమవుతోంది. దీంతో.. భారీ ఎత్తున ఆస్తి నష్టంతో పాటు.. ఇరు వర్గాల మధ్య గొడవ మరింత తీవ్రమైంది.
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా రాజకీయంగా వైరం రెండు వర్గాల మధ్య నెలకొంది. దీనికి గత డిసెంబరులో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘర్షణలు మరింత ముదిరేలా చేసినట్లు చెబుతున్నారు. దీంతో.. రెండు వర్గాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి వేళలోనే.. కొద్ది రోజుల క్రితం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
స్థానిక రాజకీయ నేత సోదరుడ్ని వారి ప్రత్యర్థి వర్గం దారుణంగా హత్య చేసింది. దీంతో.. సదరు నేతకు చెందిన వ్యక్తులు ప్రత్యర్థి నేత వర్గానికి చెందిన వారి ఇళ్లపై పడ్డారు. కనిపించిన దాన్ని తగలపెట్టేశారు. ఇదెంత ఎక్కువంటే.. కనిపించిన ద్విచక్రవాహనాలు.. కార్లు.. ఇళ్లను కాల్చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘర్షణలకు కారమని భావిస్తున్న యాభై మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. సదరు ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఈ అల్లర్లు మరింత తీవ్రతరం కాకుండా చూసేందుకు భారీగా బందోబస్తు పెట్టినట్లుగా తెలుస్తోంది.