Begin typing your search above and press return to search.

ఆయన కార్ల విలువే ఏకంగా 40వేల కోట్లు?

By:  Tupaki Desk   |   8 Nov 2020 8:30 PM IST
ఆయన కార్ల విలువే ఏకంగా 40వేల కోట్లు?
X
నిజంగానే ఆయన రేంజే వేరు.. ఏకంగా 40వేల కోట్ల విలువైన కార్లు ఆయనకు ఉన్నాయంటే మాటలా? అంతపెద్ద సంపన్నుడు ఆయన.. ఏకంగా 600 రోల్స్ రాయిస్ కార్లు, 570 మెర్సిడేజ్ బెంజ్ కార్లు.. 450 ఫెరారీలు, 200 బీఎండబ్ల్యూలు, 170 జాగ్వార్ లు.. ఇలా లెక్కలేనన్నీ కార్లు బ్రూనై సుల్తాన్ గ్యారేట్ లో ఉన్నాయి. కేవలం ఇది నోటి లెక్క మాత్రమేనట..

నిజానికి బ్రూనై సుల్తాన్ కు 5000 నుంచి 7వేల కార్లు ఉండొచ్చని ఓ అంచనా.. వాటి విలువ దాదాపు 40వేల కోట్ల రూపాయలు పైచిలుకేనట..విలాసవంతమైన కార్లు అంటే ఆయనకి తగని మోజు. అందుకే ప్రపంచంలోనే మరెవ్వరూ సేకరించలేనన్ని కార్లతో తన గ్యారేజీలను నింపేశాడు.

సుల్తాన్ పెళ్లి ఊరేగింపు కోసం కొన్న రోల్స్ రాయిస్ కారు విలువ సుమారు రూ.104 కోట్లు అంట.. ఆ కారుకు 24 క్యారెట్ల బంగారంతో పూత పూసి రీడిజైన్ చేశాడట.. ఆయన దగ్గరున్న రోల్స్ రాయల్స్ కార్లు ప్రపంచంలోనే మరెవరి దగ్గర లేవట..

బ్రూనై సుల్తాన్ కు ఒక్క కార్లే కాదు.. రాజుగారి భవనం.. విమానం అన్నీ అద్భుతాలే.. 722 కోట్ల రూపాయల ఖరీదు చేసే ఎయిర్ బస్, 1300 కోట్ల బోయింగ్, 2వేల కోట్ల రూపాయల బోయింగ్ విమానం.. ఇలా చాలా ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నివాస రాజభవనం సుల్తాన్ దే.

దాదాపు 11వేల కోట్ల రూపాయల భవంతిని బ్రూనై సుల్తాన్ కట్టుకున్నాడు. 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1788 గదులు, 257 బాత్ రూమ్ లు, ఐదు స్విమ్మింగ్ ఫూల్స్ ఉన్నాయి. రాజుగారి సిరిసంపదలకు కారణంగా అక్కడి చమురు నిల్వలే. 20వ శతాబ్ధంలో అక్కడ బయటపడ్డ చమురు నిల్వలు దాన్ని సంపన్న దేశంగా మార్చాయి. సుల్తాన్ కఠిన శిక్షలతో క్రూర నియంతగా పేరుతెచ్చుకున్నాడు. ముగ్గురు భార్యలు, 12మంది సంతానం ఆయన సొంతం.