Begin typing your search above and press return to search.
మైనర్ బాలికపై 400 మంది అత్యాచారం.. అసలేం జరిగిందంటే?
By: Tupaki Desk | 15 Nov 2021 1:30 AM GMTఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా మైనర్ బాలికపై 400 మంది అత్యాచారం. ఇందులో పోలీసులు కూడా ఆ బాలికపై కామవాంఛ తీర్చుకున్నారు. దేశ చరిత్రలోనే అత్యంత షాకింగ్ ఘటన ఇదీ.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో తాజాగా వెలుగుచూసింది.
ఓ మైనర్ బాలికపై ఏకంగా 400 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులపైనా దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటిదాకా 9 మందిని నిందితులుగా గుర్తించగా.. నలుగురు అరెస్ట్ అయ్యారని తెలిసింది.
పేదరికంలోనూ సొంతకాళ్లపై నిలబడేందుకు ఆ మైనర్ బాలిక చేసిన ప్రయత్నాలను అలుసుగా తీసుకొని పరిచయమైన ప్రతీవాడు ఆమెను చెరిచాడు. ఉద్యోగం ఇప్పించకపోగా ఆమెను శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ కు వెళితే అనూహ్యంగా పోలీసులు సైతం ఆమెను లాడ్జికి తీసుకెళ్లి రేప్ చేశారు.
ఇవన్నీ బాలిక ఆరోపణలు కాగా.. వరుస రేప్ ల కారణంగా గర్భం దాల్చిన ఆ బాలిక ఎటూ పాలుపోలేని స్థితిలో శిశు సంక్షేమ శాఖను ఆశ్రయించింది. అక్కడి అధికారుల సహాయంతో మొత్తానికి అత్యాచార కేసు నమోదైంది. సంచలనం రేపిన ఈ సంఘటనపై బీడ్ జిల్లా ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు.
బీడ్ జిల్లా, అంబేజోగై తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన బాధిత బాలికది పేద కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ రోజుకూలీలు. ఉన్నంతలో కొద్దోగొప్పో కూతురిని చదివించారు. రెండేళ్ల కిందట తల్లి అనారోగ్యంతో చనిపోవడంతో బాలిక బాధలు పెరిగాయి. కూతురిని సాకలేని తండ్రి ఆమె వయసు కూడా ఆలోచించకుండా బాల్య వివాహం చేశాడు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న బాలికకు అత్తారింట్లో మామ నుంచి వేధింపులు.. ఏడాదిన్నర కష్టాలు అనుభవించి చివరకు నాన్న దగ్గరికి వచ్చేసింది. అనంతరం ఖాళీగా ఉండలేక ఆరునెలల కిందట అంబేజోగై పట్టణానికి చేరుకుంది.
ఓ కోచింగ్ సెంటర్ లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు బాలికకు పరిచయమయ్యారు. ఆమెను పనిలోకి తీసుకుంటామని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ వ్యక్తుల నుంచి స్నేహితులు కొందరు కూడా ఇదే రీతిలో ఉద్యోగం ఇప్పిస్తామనే సాకుతో బాలికను రేప్ చేశారు.
అలా గడిచిన ఆరు నెలల వ్యవధిలో దాదాపు 400 మంది తనను అత్యాచారం చేశారని బాలిక ఆరోపిస్తోంది. అత్యాచారాలతో గర్భం దాల్చడంతో తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరూ పోలీసులు ఆమెను అత్యాచారం చేశారు. చివరకు శిశుసంక్షేమ శాఖను ఆశ్రయించింది. ఎస్పీతో అధికారులు మాట్లాడి బాలిక ఫిర్యాదును నమోదు చేయించారు. ఇప్పటిదాకా తొమ్మిది మందిని నిందితులుగా చేర్చారు. వారిలో నలుగురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు అబార్షన్ చేయించాలని శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.