Begin typing your search above and press return to search.

దేశ రాజ‌ధానిలో విష‌వాయువు లీకేజీ దారుణం

By:  Tupaki Desk   |   7 May 2017 10:10 AM IST
దేశ రాజ‌ధానిలో విష‌వాయువు లీకేజీ దారుణం
X
దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణం జ‌రిగింది. త‌ప్పు ఎవ‌రిదైనా.. అందుకు మూల్యం మాత్రం అమాయ‌కులైన వంద‌లాది పిల్ల‌లు చెల్లించాల్సి వ‌చ్చింది. ఒక కంటెయిన‌ర్ డిపో నుంచి విష‌పూరిత ర‌సాయ‌నాలు లీక్ అయి.. క‌ల‌క‌లం రేపాయి. ఈ విష‌వాయువులు లీకైన ప్ర‌దేశానికి ద‌గ్గ‌ర్లోనే ఉన్న పాఠ‌శాల పుణ్య‌మా అని.. పాఠాలు నేర్చుకునేందుకు వ‌చ్చిన చిట్టిపొట్టి పిల్ల‌లు ఇప్పుడు ఆసుప‌త్రిపాల‌య్యారు. తీవ్ర అస్వ‌స్థ‌తకు గురైన కొంద‌రు పిల్ల‌లు ఐసీయూలో చేరారు.

తుగ్ల‌కాబాద్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ దారుణంలో డిపోలో నుంచి వెలువ‌డిన ర‌సాయ‌నాలు ప‌క్క‌నే ఉన్న రాణి ఝూన్సీ పాఠ‌శాల‌.. ప్ర‌బుత్వ బాలిక‌ల పాఠ‌శాల‌లోకి వ్యాపించాయి. దీంతో.. విద్యార్థుల క‌ళ్ల‌ల్లో మంట‌లు.. శ్వాస తీసుకోవ‌టానికి ఇబ్బంది ప‌డి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. విష వాయువు లీకేజీతోఉక్కిరిబిక్కిరి అవుతున్న పిల్ల‌ల్ని ప‌ట్టుకొని ఆసుప‌త్రి వైపు ప‌రుగులు తీశారు.

విష‌వాయువు కార‌ణంగా 460 మంది చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు. వీరింద‌రిని హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. ఇద్ద‌రు మాత్రం ప‌రిస్థితి విష‌మించి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. విష‌వాయువుల లీకేజీ అంశంపై కేంద్ర‌మంద్రి జేపీ న‌డ్డా తీవ్రంగా రియాక్ట్ అయి విచార‌ణ‌కు ఆదేశాలు చేశారు.

బాధిత చిన్నారుల్ని కేంద్రం నేతృత్వంలో న‌డిచే ఆసుప‌త్రికిత‌ర‌లించి వైద్యం చేస్తున్నారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఎదుర్కొంనేందుకు ఎయిమ్స్ వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉదంతంపై ఢిల్లీ రాష్ట్ర స‌ర్కారు స్పందించింది. న్యాయ‌విచార‌ణ‌కు ఆదేశించింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న విద్యార్థులు కోలుకుంటున్నార‌ని.. వారికి ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని చెబుతున్నారు. దేశ రాజ‌ధానిలోనే ఇలాంటి ఘ‌ట‌న చోటు చేసుకోవ‌టంపై ప‌లువురు విస్మ‌యానికి గురి అవుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/