Begin typing your search above and press return to search.

పాతికేళ్ల ప్రియుడిపై 40 ఏళ్ల వివాహిత యాసిడ్ దాడి

By:  Tupaki Desk   |   13 May 2018 8:21 AM GMT
పాతికేళ్ల ప్రియుడిపై 40 ఏళ్ల వివాహిత యాసిడ్ దాడి
X
దారుణ‌మైన యాసిడ్ దాడి ఉదంతాల్లో ఇదో కొత్త కోణం. గ‌తంలో జ‌రిగిన‌ యాసిడ్ దాడుల ఉదంతాల‌ను గ‌మ‌నిస్తే...ఓ అమ్మాయిని అబ్బాయి ప్రేమించడం,ఆమె అందుకు నో చెప్ప‌డ‌మో లేదా మ‌రే కార‌ణంగానో...అబ్బాయి హ‌ర్ట‌వ‌డం...ప‌గ‌తో ర‌గిలిపోతూ ఆమెపై యాసిడ్ పోయ‌డం..దీంతో ఆ అమ్మాయి జీవితం బుగ్గిపాలు చేయ‌డం...త‌ద్వారా వాడి జీవితం జైలు పాల‌వ‌డ‌డం...తెలిసిన సంగ‌తే. ఇలా కొందరు మూర్ఖులు చేసే క్రూరమైన ప‌నుల‌కు ప‌లువురు అమ్మాయిలు బ‌ల‌య్యారు. అయితే అదే అమాన‌వీయ చేష్ట‌ల‌ను ఓ మ‌హిళ చేసింది. పైగా ఆమె కాలేజీ విద్యార్థో లేదా పెళ్లి కాకుండా ఉన్న అమ్మాయో కాదు..వివాహిత‌. ఇంకా చిత్ర‌మేంటంటే...ఆమె వ‌య‌స్సు న‌ల‌భై ఏళ్లు కాగా..ఆమె ప్రేమికుడి వ‌య‌స్సు కేవ‌లం పాతికేళ్లు. ఈ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన యాసిడ్ దాడి జ‌రిగింది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో.

శుక్రవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసిన‌ ఈ దారుణ‌మైన ఘ‌ట‌న వివరాల్లోకి వెళితే...ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన మేహరాజ్ బేగం వ‌య‌స్సు 40 ఏళ్లు. ఆమెకు వివాహం అవ‌డ‌మే కాకుండా ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు!!ఈవిడ దిల్షాద్ అహ్మద్ అనే 25 ఏళ్ల కుర్రాడితో ప్రేమలో పడింది!!! స‌హ‌జంగానే (!) వీరిద్దరి మధ్య గత కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే ఇటీవలే వివిధ కార‌ణాల వ‌ల్ల ఈ ఇద్దరు ప్రేమికుల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో దిల్షాద్ అహ్మద్.. బేగంకు దూరంగా ఉంటున్నాడు. ఆమె క‌ల‌వాల‌ని కోరిన‌ప్ప‌టికీ ఆయ‌న నిరాక‌రిస్తున్నాడు. దీంతో అహ్మద్‌పై కోపం పెంచుకున్న మేహరాజ్.. శుక్రవారం రాత్రి దిల్షాద్‌పై యాసిడ్ చేసింది. ఈ దాడిలో బాధితుడైన పాతికేళ్ల ప్రియుడు దిల్షాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలి కోసం గాలిస్తున్నారు.