బీజేపీ పుట్టి ముంచేస్తున్న '40 పర్సంట్ గవర్నమెంట్'?

Thu Mar 30 2023 05:00:02 GMT+0530 (India Standard Time)

40 percent government that BJP

దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని కలలు గంటున్న బీజేపీకి.. ముఖ్యంగా మరో నెలలో వచ్చిన కర్ణాటక ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కడం ద్వారా.. తెలంగాణలోనూ అధికారం దక్కించుకోవాలనేది కమల నాథుల ప్లాన్. అయితే.. ఇప్పుడు.. ప్రజల నోట ఎక్కడ విన్నా.. `40 పర్సంట్ గవర్నమెంట్` మాటే వినిపిస్తోంది. దీనికి కారణం.. ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టుల్లో 40 శాతం వాటాలను లంచాలుగా తీసుకుంటున్నారనే వాదన ఉంది.



ఇటీవల కూడా.. ఓ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు కోటిన్నర రూపాయలు లంచంగా తీసుకుంటూ.. దొరికిపోయాడు. దీంతో ఇప్పుడు ఈ ఫార్టీ పర్సంట్ నినాదమే ఎన్నికల్లో బలంగా పనిచేస్తోంది. ఇక దీనికి తోడు ప్రచారం లో ఉన్న కొన్ని సర్వే ల ప్రకారం.. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాల్లో నిరుద్యోగం కీలకంగా మారనుంది. దాదాపు 29.1% మేర ఎఫెక్ట్ ఈ అంశానిదే ఉండనుంది. విద్యుత్ నీళ్లు రహదారుల అంశాలు 21.5 % మేర ప్రభావం చూపనున్నాయి.

ఇక కరోనా  ప్రభావం 4% మేర ఉండనున్నట్టు వెల్లడైంది. విద్యా వసతుల అంశం 19% మేర ప్రభావం చూపనుంది. శాంతి భద్రతల అంశం 2.9% మేర ప్రభావం చూపనుండగా... అవినీతి నియంత్రణ 12.7% మేర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తోంది. మత విద్వేషాల అంశం 24.6% మేర ప్రభావం చూపనుందని తేలింది. అత్యంత కీలకమైన హిజాబ్ వివాదం 30.8% మేర ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. అంటే.. గుండుగుత్తగా.. మైనారిటీలు కాంగ్రెస్కే మొగ్గు చూపనున్నారు.


బీజేపీ పనితీరుపై  27.7% మంది "బాగుంది" అని 21.8% మంది "సాధారణం" అని "బాలేదు" అని 50.5% మంది చెప్పడం గమనార్హం. ఇక ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై పని తీరుపై సర్వే చేయగా...26.8% మంది బాగుందని 26.3% మంది సాధారణంగా ఉందని 46.9% మంది బాలేదని చెప్పారు. ఈ పరిణామాలను గమనిస్తే.. ఎలా చూసుకున్నా.. కాంగ్రెస్ వైపే ప్రజలు మెజారిటీగా మొగ్గు చూపుతున్నారని అంటున్నారు పరిశీలకులు.