Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : 40 మంది పోలీసులకు కరోనా పాజిటివ్!

By:  Tupaki Desk   |   1 May 2020 9:10 AM GMT
బ్రేకింగ్ : 40 మంది పోలీసులకు కరోనా పాజిటివ్!
X
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ మహమ్మారి తన ప్రతాపం చూపుతోంది. క‌రోనా భ‌యానికి ప్ర‌జ‌లు కంటిమీద కునుకులేకుండా భ‌యంతో బిక్కుబిక్కుమంటున్నారు. మ‌రోవైపు వైర‌స్ వ్యాప్తిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తూ..ప్రాణాలని పనంగా పెడుతూ రాత్రింబ‌వ‌ళ్లూ రోడ్ల‌పై పోలీసులు గ‌స్తీ కాస్తున్నారు. అయితే , అటువంటి పోలీసులు కూడా క‌రోనా బారిన‌ప‌డుతుండటం ఎప్పుడు ఆందోళన కరంగా మారింది.

తాజాగా కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడంలో భాగంగా విధుల్లో ఉన్న 40 మంది పోలీసులకు కరోనా సోకింది. మహారాష్ట్రలోని మాలేగావ్ లో వివిధ కంటెయిన్ మెంట్ జోన్లలో లాక్‌ డౌన్‌ విధులు నిర్వహిస్తున్న పలువురు ఎస్‌ ఐలు, కానిస్టేబుళ్లు ఈ వైరస్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం వీరంతా వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు మహారాష్ట్ర లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. తాజాగా 583 కేసులు వెలుగు చూడడంతో రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 10,490కి చేరింది. ఒక్క ముంబయిలోనే 7061 కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, మహారాష్ట్ర కరోనా మరణాల్లోనూ ముందుంది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ 459 మంది మృత్యువాత పడ్డారు. ఇవాళ ఒక్కరోజే 27 మంది మరణించగా, వాటిలో 20 మరణాలు ముంబయిలోనే సంభవించాయి.