Begin typing your search above and press return to search.

కరోనా కారణంగా 40 లక్షల మంది మృతి .. ఆ ఐదు దేశాల్లోనే సగానికిపైగా ...!

By:  Tupaki Desk   |   18 Jun 2021 10:30 AM GMT
కరోనా కారణంగా 40 లక్షల మంది మృతి .. ఆ ఐదు దేశాల్లోనే సగానికిపైగా ...!
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మారణహోమం సృష్టించింది. కరోనా మహమ్మారి మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. కరోనా మహమ్మారి కొంచెం అదుపులోకి వచ్చినట్టే కనిపిస్తున్నా కూడా పూర్తి స్థాయిలో బ్రేకులు పడట్లేదు. అలాగే , కరోనా మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య నాలుగు మిలియన్లను దాటింది. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో, మరణాలకు అడ్డుకట్ట వేయడంలో విజయవంతమైన అగ్రదేశాలు ఇప్పుడిప్పుడే కొంచెం రిలాక్స్ అవుతున్నాయి. అయితే , కరోనా మరణాలకు అడ్డుకట్ట వేయలేకపోతోన్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 40 లక్షల మంది మరణించినట్లు రాయటర్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇప్పటివరకు 17,81,83,639 నమోదయ్యాయి. ఈ 4 లక్షల మరణాల్లో సగానికి పైగా అయిదు దేశాల్లోనే సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా మరణాల్లో అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా, మెక్సికోలదే 50 శాతం వాటా ఉంది. పెరూ, హంగేరి, బోస్నియా, చెక్ రిపబ్లిక్, జీబ్రాల్టర్‌లల్లో ఈ కరోనా మరణాలు రేటు అధికంగా ఉంటోంది. ఆయా దేశాల జనాభా, వైరస్ బారిన పడిన వారి సంఖ్యతో పోల్చుకుంటే, మరణాలు అక్కడ అధికంగా ఉంటున్నాయి. గత ఏడాది మార్చి నుంచి కరోనా వైరస్ సోకిన ప్రతి వంద మందిలో 43 మంది లాటిన్ అమెరికా దేశస్థులేనని రాయటర్స్ తెలిపింది. ఈ రీజియన్‌ కు చెందిన తొలి తొమ్మిది దేశాల్లో వారం రోజులుగా కరోనా మరణాలు మరింత అధికమైనట్లు పేర్కొంది. బొలీవియా, చిలీ, ఉరుగ్వేల్లో కరోనా బారిన పడిన పేషెంట్లలో 25 నుంచి 40 సంవత్సరాలలోపు వయస్సున్న వారు అధికంగా ఉంటోన్నారు.

కరోనా మరణాతో లాటిన్ అమెరికా సహా పలు దేశాలు కొత్తగా శ్మశానాలను విస్తరించుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నట్లు రాయటర్స్ తెలిపింది. అనేక దేశాల ప్రభుత్వాలు శ్మశానాల కోసం ఇదివరకెప్పుడూ లేనంతగా స్థలాలను కేటాయించాల్సి వచ్చిందని పేర్కొంది. రోజురోజుకూ మరణాలు పెరుగుతోండటంతో సముద్ర తీర ప్రాంతాలు, పార్కులు, జన సంచారం పెద్దగా లేని చోట్ల మృతదేహాలను ఖననం చేయడానికి అనుమతులను మంజూరు చేశాయి. వారం రోజుల్లో చోటు చేసుకున్నమరణాలు సగటును పరిగణనలోకి తీసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా భారత్ మొదటి స్థానంలో నిలిచింది. రెండున్నర నెలలుగా భారత్‌ లో కరోనా మరణాలు రెండు నుంచి నాలుగు వేల వరకు నమోదైన విషయం తెలిసిందే. ఈ స్థాయిలో మరణాల సంఖ్య మరే దేశంలోనూ నమోదు కాలేదు. గరిష్ఠంగా ఒక్కరోజు వ్యవధిలో నాలుగు వేలకు పైగా కోవిడ్ సంబంధిత మరణాలు భారత్‌ లో నమోదయ్యాయి.