Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలో డ‌యానా మ‌ళ్లీ పుట్టిందా?

By:  Tupaki Desk   |   19 July 2019 4:42 AM GMT
ఆస్ట్రేలియాలో డ‌యానా మ‌ళ్లీ పుట్టిందా?
X
ఆ మ‌ధ్య‌న విడుద‌లై స‌క్సెస్ అయిన మ‌నం సినిమా గుర్తుందా? కొడుక్కి తండ్రి పుట్ట‌టం.. పాత జ‌న్మ తాలుకూ జ్ఞాప‌కాల్ని గుర్తుంచుకోవ‌టం.. ఇలా అనూహ్యంగా సాగే ఈ సినిమాను పోలిన వైనం ఆస్ట్రేలియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. క‌ట్ చేస్తే..

చ‌నిపోయిన త‌ర్వాత కూడా ప్ర‌పంచం మ‌ర్చిపోలేని ప్ర‌ముఖులు కొంద‌రు ఉంటారు. వారి గురించి త‌ర‌చూ తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌ట‌మే కాదు.. వారికి సంబంధించిన సంగ‌తుల్ని స్మ‌రించుకోవ‌టం క‌నిపిస్తుంటుంది. అలాంటి కోవ‌కే చెందుతారు నాటి వేల్స్ రాణి.. ప్రిన్సెస్ డ‌యానా.

భ‌ర్త‌తో పొస‌గ‌క‌పోవ‌టం.. ఆమె ప్రేమాయ‌ణాలు.. త‌న బాయ్ ఫ్రెండ్ తో కారులో వేగంగా వెళుతూ యాక్సిడెంట్ కు గురి కావ‌టం లాంటి విష‌యాలు తెలిసిన వారికి డ‌యానా ఒక‌లా అర్థ‌మైతే.. దాతృత్వం.. సాయం చేసే గుణం.. వేల్స్ యువ‌రాణి అన్న భావ‌న క‌ల‌గ‌నీయ‌కుండా అంద‌రితోనూ అప్యాయంగా మాట్లాడ‌టం.. స్నేహ‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించే తీరుతో ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆమె అప్ప‌టికి ఇప్పటికి హాట్ టాపిక్కే.

ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాకు చెందిన నాలుగేళ్ల కుర్రాడు.. త‌న‌కు తాను ప్రిన్సెస్ డ‌యానాగా చెప్పుకోవ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఒక టీవీ యాంక‌ర్ కుమారుడైన బిల్లీ క్యాంప్ బెల్ అనే బాలుడు.. తాను డ‌యానాగా చెప్పుకుంటున్నాడు. అంతేనా.. ఆమెకు సంబంధించిన వివ‌రాల్ని వెల్ల‌డిస్తున్నారు. వ్య‌క్తిగ‌త‌.. కుటుంబానికి సంబంధించిన ప‌లు విశేషాల్ని చెబుతూ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాడ‌ట‌.

రెండేళ్ల వ‌య‌సులో డ‌యానా ఫోటో చూసిన నాటి నుంచి ఇలా మాట్లాడుతున్నాడ‌ని ఆ బాలుడి తండ్రి వెల్ల‌డించారు. ఇంతేనా.. విల‌య‌మ్.. హ్యారీల‌ను త‌న పిల్ల‌లుగా ఈ పిల్లోడు చెప్ప‌టం విశేషం. మ‌రీ పిల్లాడి గురించి విలియం.. హ్యారీలు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో. ఒక‌వేళ‌.. వారు కానీ ఆ పిల్లాడ్ని క‌లిస్తే మాత్రం.. రీల్ మ‌నం మాదిరి రియ‌ల్ మూవీని చూసిన‌ట్లే.