Begin typing your search above and press return to search.
ఏపీలో కొత్త జిల్లాల కోసం 4 సబ్ కమిటీలు
By: Tupaki Desk | 22 Aug 2020 4:20 PM ISTసీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నవరత్నాలను అమలు చేసిన జగన్ తాజాగా మరో అడుగు ముందుకేశారు.
ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిన ప్రబుత్వం తాజాగా ఆ కమిటీకి అనుబంధంగా మరో నాలుగు సబ్ కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వీరికోసం ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల సరిహద్దులు.. సమస్యల పరిశీలన.. జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఒక కమిటీ.. ఐటీ సంబంధిత అంశాల కోసం మరో కమిటీ ఇలా నాలుగు కమిటీలను నియమించారు.
అంతేకాక జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన పదిమంది సభ్యులతో కూడా కమిటీలను ఏర్పాటు చేశారు. సబ్ కమిటీల కార్యకలాపాల కోసం ప్రత్యేక సచివాలయం ఆరునెలలు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో తెలిపారు.