Begin typing your search above and press return to search.

అఫిషియ‌ల్: టీడీపీ గూటికి న‌లుగురు ఎమ్మెల్యేలు

By:  Tupaki Desk   |   22 Feb 2016 9:12 PM IST
అఫిషియ‌ల్: టీడీపీ గూటికి న‌లుగురు ఎమ్మెల్యేలు
X
చ‌ర్చోప‌చ‌ర్చ‌ల‌కు తెర‌ప‌డింది. అభివృద్ధి నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు - ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశం గూటికి చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో సోమ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ఈ నాయ‌కులు ప‌చ్చ కండువా క‌ప్పుకున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి - ఆయ‌న కుమార్తె అఖిలప్రియ - జ‌మ్మ‌లమ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి - విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ లు విజయవాడలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 106కు చేరింది.