Begin typing your search above and press return to search.

కరోనా విషాదం: హైదరాబాద్ పోలీస్, అతడి కుటుంబానికి సోకింది

By:  Tupaki Desk   |   14 April 2020 1:20 PM IST
కరోనా విషాదం: హైదరాబాద్ పోలీస్, అతడి కుటుంబానికి సోకింది
X
లాక్ డౌన్ అమలులో ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్నారు మన పోలీసులు.. ప్రజలను రోడ్ల మీదకు వస్తే కంట్రోల్ చేస్తున్నారు. నిత్యావసరాలకు వస్తున్న వారిని సెట్ రైట్ చేస్తున్నారు. రేషన్ సరఫరాలో పాలుపంచుకుంటున్నారు. కొన్ని వారాలుగా లాక్డౌన్ అమలు కోసం పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.

కాగా మార్చి 24 నుంచి కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న పోలీసులకు వైరస్ అంటుకోవడం విషాదం నింపింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న 56 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్ మునావార్ ఖాన్ కు తాజాగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఇతను రాష్ట్ర సచివాలయానికి సమీపంలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ చెక్ పోస్టులో కొద్దిరోజులుగా డ్యూటీ చేస్తున్నారు.

అతడికి తాజాగా లక్షణాలు బయటపడడంతో పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఇక అతడి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా.. కుటుంబంలోని నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కానిస్టేబుల్ ఐదేళ్ల మనవుడు, ఇద్దరు కుమారులు, కుమార్తెకు కరోనా పాజిటివ్ గా తేలింది.

దీంతో వీరిని హుటాహుటిన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిన్న రాత్రి విడుదల చేసిన మెడికల్ బులిటెన్ తెలంగాణలో 531 కేసులు నమోదయ్యాయి. ఇందులో పోలీసులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. మరికొంత మంది విధుల్లో ఉన్న వారికి పరీక్షలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.