Begin typing your search above and press return to search.

రోడ్డు పై ఉమ్మినందుకు రూ. 39 లక్షల ఫైన్ ..ఎక్కడంటే ?

By:  Tupaki Desk   |   7 Aug 2021 2:00 PM IST
రోడ్డు పై ఉమ్మినందుకు రూ. 39 లక్షల ఫైన్ ..ఎక్కడంటే ?
X
కరోనా వైరస్ మహమ్మారి గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని గజగజ వణికిపోయేలా చేస్తోంది. రోజుకో కొత్త వేరియంట్ వెలుగులోకి వస్తూ అందరిని ఆందోళనకి గురి చేస్తుంది. మరోవైపు ఇంకొందరు మాత్రం కరోనా మహమ్మారి లేదు ఏం లేదు అన్నట్టుగా తమకి ఇష్టం వచ్చినట్టు, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. రోడ్లు, ఇతర జనసంచార బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తూ కొవిడ్ వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణం అవుతున్నారు. అలాంటి వారి పట్ల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొంచెం కఠినంగానే వ్యవహరిస్తున్నారు.

అలా, కరోనా వైరస్ మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత రోడ్డు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినవారి నుంచి బీఎంసీ అధికారులు భారీ జరిమానా వసూలు చేశారు. దాదాపు 19,000 మంది వ్యక్తుల నుంచి రూ.39 లక్షల జరిమానా వసూలు చేసినట్లు బీఎంసీ డిప్యూటీ కమిషనర్ సంగీత ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ముంబై నగరవాసుల ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ వివరించారు. నగర ప్రజల ఆరోగ్య రక్షణకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు దీనికి విఘాతం కలింగే చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

రోడ్లపై ఉమ్మి వేయడం కరోనా వైరస్ తో పాటు ఇతర వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నట్లు వెల్లడించారు. రోడ్లపై ఉమ్మి వేయడాన్ని అడ్డుకునేందుకు రూ.200లు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రజలు అవగాహనతో మెలగాలని సూచించారు. అలాగే , అలాగే కరోనా వైరస్ వ్యాపించకుండా ఫేస్ మాస్కులు తప్పనిసరిగా వాడాలని బీఎంసీ అధికారులు నగర ప్రజలు సూచిస్తున్నారు. అలాగే చేతులకు తరచూ శ్యానిటైజర్లు వాడాలని, భౌతిక దూరం పాటించాలని కోరుతున్నారు. ఈ విషయంలోనూ బీఎంసీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించనందుకు కరోనా వైరస్ ప్రారంభమైన 2020 మార్చి నుంచి రూ.57 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు బీఎంసీ జూన్ మాసంలో ఓ అధికారిక ప్రకటలో తెలిపింది. ఇదిలా ఉండగా ముంబై నగరంలో కరోనా కేసులు కట్టడిలోకి వచ్చాయి. శుక్రవారం రోజు ముంబైలో 309 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, 8 మంది దుర్మరణం చెందారు.