Begin typing your search above and press return to search.

జనవరి 1 న 3.7 కోట్ల మంది పుడుతార‌ట

By:  Tupaki Desk   |   1 Jan 2021 4:26 PM IST
జనవరి 1 న 3.7 కోట్ల మంది పుడుతార‌ట
X
సంవత్సరం ఏదైనా కూడా జనవరి ఒకటో తేదీ అనేది చాలా స్పెషల్. మ‌రి ఆ రోజు జన్మించిన పిల్ల‌ల‌కు ఇంకా స్పెష‌ల్‌. ఎందుకంటే కొత్త ఏడాది రోజున పుట్టామ‌ని గ‌ర్వంగా చెప్పుకుంటారు. ఆ రోజున డెలివ‌రీ అయ్యేందుకు చాలా మంది గ‌ర్భిణిలు ఇష్ట‌ప‌డుతుంటారు. ఆ స‌మ‌యానికి సాధార‌ణ కాన్పు జ‌ర‌గ‌క‌పోయిన‌ప్ప‌టికీ, సీజేరియ‌న్ చేసుకునేందుకు కూడా కొందరు వెనుకాడరు. ఆరోజే పిల్ల‌ల్ని క‌నాల‌నే ల‌క్ష్యంతో కూడా భార్యాభ‌ర్త‌లు ప్లానింగ్ చేసుకున్న సంద‌ర్భాలు కూడా ఉంటాయి.

2021, జ‌న‌వ‌రి 1వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా 3.7 కోట్ల మంది జ‌న్మించ‌నున్న‌ట్లు యునిసెఫ్ ప్ర‌క‌టించింది. భార‌త‌దేశంలో అయితే 60 వేల మంది శిశువులు పుట్టే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. 2021 ఏడాదిలో ఫిజి దేశం తొలి బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లికే అవ‌కాశం ఉంద‌ని, చివ‌ర‌గా అమెరికా ఉండొచ్చ‌ని పేర్కొంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ది దేశాల‌ను చూస్తే.. ఇండియాలో 59,995 మంది శిశువులు, చైనాలో 35,615, నైజీరియాలో 21,439, పాకిస్తాన్‌ లో 14,161, ఇండోనేషియాలో 12,336, ఇథియోపియాలో 12,006, అమెరికాలో 10,312, ఈజిప్టులో 9,455, బంగ్లాదేశ్‌లో 9,236, కాంగోలో 8,640 మంది శిశువులు జ‌న్మించ‌నున్నార‌ని తెలిపింది. ఇక 2021లో మొత్తంగా 140 మిలియ‌న్ల పిల్ల‌లు పుట్టే అవ‌కాశం ఉంద‌ని యునిసెఫ్ అంచ‌నా వేసింది. వారి స‌గ‌టు జీవిత కాలం 84 సంవ‌త్స‌రాలు ఉండొచ్చు అని తెలిపింది.