Begin typing your search above and press return to search.

అయ్యప్ప దర్శనానికి 36మంది మహిళలు.. మళ్లీ దుమారం

By:  Tupaki Desk   |   15 Nov 2019 7:50 AM GMT
అయ్యప్ప దర్శనానికి 36మంది మహిళలు.. మళ్లీ దుమారం
X
భక్తుల ఇల వేల్పు అయిన శబరిమల అయ్యప్ప స్వామి దీక్షలు మొదలయ్యాయి. అయ్యప్పను దర్శించుకునేందుకు దీక్షలు బూనిన భక్తులు, సాధారణ భక్తులు కేరళ లోని శబరిమల కు తరలి వెళుతున్నారు. అయితే ఈ ఆలయం చుట్టూ కొద్ది రోజులు గా వివాదాలు ముసురుకున్నాయి. పరమ పవిత్రం గా భావించే ఈ ఆలయం లోకి నెలసరి కలిగి ఉండే 13 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు మహిళల ను అనుమతించరు. అయితే కేరళ సర్కారు సుప్రీం తీర్పు ను అనుసరించి మహిళల ను దర్శనానికి అనుమతించి వివాదాన్ని రాజేసింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు లో శబరిమల లోకి మహిళల ప్రవేశం తీర్పు పెండింగ్ లో ఉంది.

అయితే ఇంత వివాదాస్పదం గా.. భక్తుల మనో భావాలు దెబ్బతీసేలా ఉన్న ఈ నిర్ణయం పై సుప్రీం కోర్టు ఏం తీర్పునిస్తుందనే టెన్షన్ నెలకొంది. మహిళల కు ప్రవేశాన్ని హిందువులు, అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు, బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం విస్తృత ధర్మాసనం మహిళల ప్రవేశం పై తీర్పు ను ఇవ్వడానికి రెడీ అయ్యింది.

ఇదే క్రమంలో చలికాలం మొదలు కావడంతో శబరిమల ఆలయ దర్శనానికి వేళైంది. అయ్యప్ప ఆలయ కమిటీ ఇప్పటికే ఆన్ లైన్ లో దర్శనానికి రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. అయితే ఈ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లలో ఇప్పటివరకు 36మంది మహిళలు కూడా పేర్లు నమోదు చేసుకోవడం మళ్లీ వివాదానికి కారణమైంది. పోలీసులు ఈ మహిళల వివరాలు సేకరించినట్లు తెలిసింది. మరి ఈ సారి ఈ మహిళల కు దర్శన భాగ్యం కలిగిస్తారా? హిందువు సంఘాలు, భక్తులు ఒప్పుకుంటారా? ఎంత వివాదం అవుతుందనేది అందరిలోనూ టెన్షన్ కు గురిచేస్తోంది..