Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో 33 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు నేరచరితులే!

By:  Tupaki Desk   |   11 March 2021 12:15 PM IST
ఆ రాష్ట్రంలో 33 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు నేరచరితులే!
X
ఎమ్మెల్యే అంటే ఓ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా ప్రతినిధి. నలుగురికి ఆదర్శప్రాయంగా నిలుస్తూ , చెడు దారిలో వెళ్లేవారికి సరైన మార్గం చూపించాలి. అలాగే తాను నడిచే దారికి తీసుకువెళ్లాలి. కానీ, ఆదర్శంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులే నేర చరితులు అయితే , వారిని చూసి ఆ నియోజక వర్గం వారు ఏం నేర్చుకోవాలి. అసలు మనం సరైన మార్గంలో నడవకుండా మిగిలిన వారిని ఎలా సరైన మార్గం లో నడవాలని చెప్పగలం. ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎమ్మెల్యేలే నేర చరితులు అయితే .. వారిని చూసి ఆ నియోజకవర్గం వారు కూడా ఆ నేరాలకు పాల్పడలా?నేర చరిత్ర కలవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నా కూడా , ఆ దిశగా కీలక ముందడుగులు మాత్రం పడటం లేదు.

ఇదిలా ఉంటే .. ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో తమిళనాడు కూడా ఓ రాష్ట్రం. ఈ నేపథ్యంలో తమిళనాడు కి చెందిన ప్రజా ప్రతినిధులకు సంబంధించి ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ ఓ కీలక నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక లో ఏముంది అంటే .. తమిళనాడులో 33 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు నేర చరిత్ర ఉన్నవారేనని , మొత్తం 204 మంది ఎమ్మెల్యేల్లో 68 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ ఓ నివేదికలో వెల్లడించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాట మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్లో... 38 మంది మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది. వీరిపై ఐదేళ్లు శిక్ష పడే కేసులు ఉన్నాయి. నేరచరిత్ర కలవారు డీఎంకే లో 40 మంది ఉన్నారు. అలాగే అన్నాడీఎంకే లో 23 మంది ఉన్నారు.

కాగా అసెంబ్లీలోని 157 మంది ఎమ్మెల్యేలు తమకు కోట్లలో ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. 89 మంది ఎమ్మెల్యేలు 5 నుంచి 12వ తరగతి లోపు చదువుకోగా.. 110 మంది డిగ్రీ అంతకంటే ఎక్కువగా చదువుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు డిప్లోమా హోల్డర్లుగా వున్నట్టు ఏడీఆర్ నివేదిక పేర్కొంది. 78 మంది ఎమ్మెల్యేలు 25 నుంచి 50 సంవత్సరాల లోపు వారుండగా.. 50 నుంచి 70 ఏళ్ల లోపు ఎమ్మెల్యేలు 125 మంది వరకు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే వయసు 77 ఏళ్లుగా ఉంది. కాగా తమిళనాట మొత్తం 204 మంది ఎమ్మెల్యేల్లో 17 మంది మంది మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు.