Begin typing your search above and press return to search.
అష్టా చమ్మా ఆడి..31 మందికి కరోనా అంటించింది?
By: Tupaki Desk | 23 April 2020 2:00 PM ISTకరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. లాక్ డౌన్ ప్రభావంతో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. బోర్ కొట్టడంతో చాలా మంది సంప్రదాయ ఆటలైన అష్టాచెమ్మ - వైకుంఠపాళీ - పులి-మేక - వామనగుండ్లు - చెస్ - క్యారమ్స్ లాంటి ఆటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఓ మహిళ కూడా బోర్ కొట్టడంతో అష్టాచెమ్మ ఆడదామని పక్కింటికి వెళ్లింది. అలా కొన్ని ఇళ్లు తిరిగిందామె. అయితే, ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన ఓ వ్యక్తి ద్వారా అప్పటికే ఆమెకు కరోనా సోకింది. అలా ఆమె వల్ల పక్కింటి వాళ్లకు - మొత్తం 31 మందికి కరోనా వ్యాప్తి చెందింది.
ఈ ఘటన తెలంగాణలోని సూర్యాపేటలో చోటుచేసుకుంది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా లో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ కరోనా చాప కింద నీరులా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ బుధవారం సూర్యాపేట జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా తబ్లిగి జమాత్ మీటింగ్ కు వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన ఓ మహిళ ద్వారా 31 మందికి కరోనా సోకినట్టు ఉన్నత స్థాయి కమిటీ దృష్టికి వచ్చింది.
తనకు కరోనా సోకిన విషయం తెలియని మహిళ - లాక్ డౌన్ వేళ టైమ్ పాస్ కోసం సమీపంలోని పలు ఇళ్లలో తిరిగుతూ అష్టా చమ్మా ఆడారు. దీంతో ఆమె కాంటాక్ట్ అయిన వారిలో చాలా మందికి కరోనా సోకింది. ఇది కూడా జిల్లాలో పెద్ద ఎత్తున కేసుల పెరుగుదలకు ఒక కారణం అయింది. కాగా, ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో 83 కరోనా కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని.. కనీసం పక్కింటి వారి వద్దకు కూడా వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు