Begin typing your search above and press return to search.

300 మూవీని టెన్నిస్ కోర్టులో చూపించాడట

By:  Tupaki Desk   |   15 Sept 2015 10:28 AM IST
300 మూవీని టెన్నిస్ కోర్టులో చూపించాడట
X
చిరకాల ప్రత్యర్థితో మరోసారి తలపడాల్సి ఉండి.. అతడి జోరుకు బ్రేకులేయాలని భావించిన టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్ కు విపరీతమైన స్ఫూర్తినిచ్చిందో సినిమా. ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ చాంఫియన్ షిప్ టైటిల్ ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న జుకోవిచ్ అనుకున్నట్లే రోజర్ పెదరర్ ను ఓడించేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఫెదరర్ కే మద్ధతు పలుకుతున్నా జుకోవిచ్ మాత్రం తడబడలేదు.. అడుగు వెనక్కి వేయలేదు.

ప్రతికూల వాతావరణం ఉన్నా.. చెలరేగిపోయిన జుకోవిచ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. రోజర్ ఫెదరర్ తో జరిగిన ఫైనల్ పోరు హోరాహోరీగా సాగినా అంతిమంగా విజయం మాత్రమే జుకోవిచ్ నే వరించింది. అయితే.. అతగాడి విజయానికి కారణం ఒక సినిమా అని చెబుతున్నారు. యూఎస్ ఓపెన్ ఫైనల్ ముందు రోజు రాత్రి జుకోవిచ్.. ప్రముఖ హాలీవుడ్ మూవీ ‘‘300’’ చూసి విపరీతమైన స్ఫూర్తిని పొందాడట.

300 సినిమాలో హీరో రెరార్డ్ బట్లర్ ను చూసి స్ఫూర్తి పొందిన జుకోవిచ్.. ఆ సినిమా ప్రభావంతో ఫైనల్ మ్యాచ్ లో చెలరేగిపోయాడట. మొత్తానికి అతి కీలకమైన ఫైనల్ మ్యాచ్ ముందు రోజు చూసిన సినిమా.. యూఎస్ టైటిల్ ను సొంతం చేసుకునేంత శక్తి ఇచ్చిందన్న మాట.