Begin typing your search above and press return to search.

దేశంలో 30% డ్రైవింగ్ లైసెన్స్ లు నకిలీవట,ఎవరన్నారంటే ?

By:  Tupaki Desk   |   15 Feb 2021 4:12 PM IST
దేశంలో 30% డ్రైవింగ్ లైసెన్స్ లు నకిలీవట,ఎవరన్నారంటే ?
X
దేశంలో చాలా మంది సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ లు పొందుతున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగా దేశంలో ప్రస్తుతం దాదాపు 30 శాతం నికిలీ డ్రైవింగ్ లైసెన్స్ లు ఉన్నట్లు తెలిపారు. ఫాస్టాగ్ తో బోగస్ లైసెన్స్ లకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు. నాగ్ పూర్ లో జాతీయ భద్రతా ప్రచారంలో పాల్గొన్న గడ్కరీ ఈ విషయం వెల్లడించారు. బోగస్ లైసెన్స్ లు పొందటం ఇప్పుడు చాలా సులభమైంది. డబ్బులివ్వడం ద్వారా ఎవరో ఒకరు ఆర్టీఓ ఆఫీస్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఫాస్డాగ్తో నకిలీ లైసెన్స్ లకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు.

ఫాస్టాగ్‌ కు సంబంధించిన గడువును పొడిగించేది లేదని కూడా నితిన్‌ గడ్కరీ స్పష్టంచేశారు. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్ ‌ను తీసుకోవాలని సూచించారు. టోల్‌ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు ఉద్దేశించిన ఫాస్టాగ్‌ తప్పనిసరి గడువు ఈరోజుతో ముగుస్తున్నదని అన్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్‌ వాడకం తప్పనిసరి కానున్నది.

అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఫాస్టాగ్‌ లేని వాహనాల నుంచి టోల్‌ప్లాజాల వద్ద రెట్టింపు ఫీజు వసూలు చేస్తామని కేంద్ర రోడ్డు, జాతీయ రహదారుల శాఖ ఆదివారం ప్రకటించింది. టోల్‌ప్లాజాల వద్ద రద్దీ, ఇంధన ఖర్చును తగ్గించే లక్ష్యంలో డిజిటల్‌ రూపంలో ఫీజులు చెల్లించే ఫాస్టాగ్‌ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

2016లోనే ఫాస్టాగ్‌ విధానాన్ని రూపొందించినప్పటికీ పలు కారణాలతో దీని అమలు వాయిదా పడుతూ వచ్చింది. ఇకపైన ఫాస్టాగ్‌ అమలును వాయిదా వేసే ప్రసక్తే లేదని కేంద్ర రోడ్డురవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టంచేశారు. ఇప్పటి వరకు 2.54 కోట్ల మంది ఫాస్టాగ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకొన్నారని తెలిపారు. రీచార్జ్‌ కార్డులాగా ఉపయోగించే ఈ ఫాస్టాగ్‌ సర్టిఫికెట్లను దేశవ్యాప్తంగా బ్యాంకులు, పలు రిటైల్‌ సంస్థలు కూడా విక్రయిస్తున్నాయి.