దేశంలో కొత్తగా 30వేల కరోనా పాజిటివ్ కేసులు

Tue Jul 20 2021 11:14:17 GMT+0530 (IST)

30,000 new corona positive cases in the country

భారతదేశంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. అయితే సెకండ్ వేవ్ జోరు తగ్గుతుంది కదా అని ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఊహించని నష్టం జరిగే అవకాశం ఉంది. ఇక మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుంది అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక దేశంలో ప్రజలు అయితే కరోనా లాక్ డౌన్ నుండి సడలింపులు ఇస్తే కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నారు. దేశంలో  గడిచిన 24 గంటల్లో కొత్తగా 30093 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.125 రోజుల తర్వాత కరోనా కేసులు 30వేలకు చేరాయి. మరో వైపు కొత్తగా 45254 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి 374 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 31174322కు పెరిగింది. ఇందులో 30353710 మంది డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి ప్రభావంతో మొత్తం 414482 మంది బాధితులు ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 406130 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో వైపు టీకా డ్రైవ్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 411846401 టీకా డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.  మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.15 శాతంగా ఉంది.  నిన్న 33.77 లక్షల మంది తొలి డోస్ వేయించుకోగా... 18.9 లక్షల మంది సెకండ్ డోస్ వేయించుకున్నారు. టెస్టుల పాజిటివిటీ రేటు 140 రోజుల్లో తొలిసారి చాలా తక్కువగా నమోదైంది. అది 29 రోజులుగా 3 శాతం కంటే తక్కువే ఉంటోంది.

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 71152 టెస్టులు చెయ్యగా... కొత్తగా 1628 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1941724కి చేరింది. కొత్తగా 22 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13154కి చేరింది. కొత్తగా 2744 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1905000కి చేరింది. ప్రస్తుతం 23570 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 23664207 టెస్టులు జరిగాయి. తెలంగాణలో కొత్తగా 746 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 637373కి చేరాయి. కొత్తగా 729 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 623773కి చేరింది. రికవరీ రేటు 97.86 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా ఐదుగురు మరణించారు. మొత్తం మరణాలు 3764కి చేరాయి. మరణాల రేటు 0.59 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9836 యాక్టివ్ కేసులున్నాయి.

ప్రపంచదేశాల్లో కొత్తగా 404138 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 19.16 కోట్లు దాటింది. కొత్తగా 6353 మంది చనిపోవడంతో  మొత్తం మరణాల సంఖ్య 41.12 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.30 కోట్లు ఉన్నాయి. ఇవి మెల్లగా పెరుగుతున్నాయి. అమెరికాలో కొత్తగా 19016 కేసులు 94 మరణాలు వచ్చాయి. బ్రెజిల్‌లో 15271 కొత్త కేసులు 494 మరణాలు సంభవించాయి. నిన్న రోజువారీ ఎక్కువ కేసులు బ్రిటన్ 39950 లో రాగా ఆ తర్వాత ఇండొనేసియా 34257 ఇండియా ఇరాన్ రష్యాలో వచ్చాయి. రోజువారీ మరణాలు నిన్న ఇండొనేసియా 1338 లో ఎక్కువగా రాగా ఆ తర్వాత రష్యా 719 బ్రెజిల్ కొలంబియా 446 అర్జెంటినా 406 లో వచ్చాయి.

ఇంగ్లండ్ లో కరోనా కేసులు తగ్గి ఆంక్షలు సడలించిన వేళ మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇంగ్లండ్ లో ఐదు వారాల్లో 154 మంది నోరోవైరస్ బారిన పడ్డట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వేగంగా వ్యాపించే గుణం ఉన్న ఈ వైరస్ సోకితే అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నారు. ముఖ్యంగా కడుపుపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో దీన్ని వాంతిని కలిగించే సూక్ష్మజీవిగా నిపుణులు భావిస్తున్నారు. వైరస్ సోకిన వారి నుంచి కూడా వ్యాపిస్తుంది. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు రెండు మూడు రోజులు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.