Begin typing your search above and press return to search.

పుల్వామాలో ఎన్‌కౌంటర్, ముగ్గురు ఉగ్రవాదులని మట్టుబెట్టిన సైన్యం !

By:  Tupaki Desk   |   3 Jun 2020 1:40 PM IST
పుల్వామాలో ఎన్‌కౌంటర్, ముగ్గురు ఉగ్రవాదులని మట్టుబెట్టిన సైన్యం !
X
జమ్మూ కాశ్మీర్ ‌లో మరో ఎన్ ‌కౌంటర్ జరిగింది. పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్ ‌కౌంటర్ లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం అయ్యారు. వారిలో ఒకరు జైష్ కమాండర్, అతను విదేశీయుడని భావిస్తున్నారు. అలాగే మరొక ఉగ్రవాది ఐఇడి పేలుడులో నిపుణుడుగా గుర్తించారు. పుల్వామా జిల్లాలో కంగన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది.

దాంతో జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం, భారత సైన్యానికి చెందిన 55 రాష్ట్రీయ రైఫిల్స్ , సిఆర్పిఎఫ్ 183 బెటాలియన్ సిబ్బంది కార్డన్-అండ్-సెర్చ్-ఆపరేషన్ ను ప్రారంభించాయి. ముందు జాగ్రత్తగా పుల్వామా జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవ నిలిపివేశారు. అయితే భద్రతా సిబ్బందిని చూసి ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో పోలీసులు కూడా ఫైర్ స్టార్ట్ చేశారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు చనిపోయారు.

భద్రతా దళాలు కూడా ఉగ్రవాదులను లొంగిపోవాలని కోరినప్పటికీ ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ముందుజాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఉగ్రవాదుల మృతితో కశ్మీర్ లోయలో అశాంతి సృష్టించేందుకు అల్లరిమూకలు ప్రయత్నిస్తారని భావించి చర్యలు తీసుకున్నారు. అలాగే, ఈ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉందని ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతున్నారు. మరోవైపు జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన కూడా ఆడపా దడపా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.