Begin typing your search above and press return to search.

ఏపీ రాజకీయమంతా '3' చుట్టూనే తిరుగుతోందిగా?

By:  Tupaki Desk   |   18 Dec 2019 11:00 PM IST
ఏపీ రాజకీయమంతా 3 చుట్టూనే తిరుగుతోందిగా?
X
ఏపీ అన్నంతనే ఇప్పుడు ‘‘3’’ గుర్తుకు వచ్చేస్తోంది. మూడు చుట్టూనే ఏపీ రాజకీయం తిరుగుతుండటం విశేషంగా చెప్పాలి. వర్తమానమే కాదు.. భవిష్యత్తులోనూ ఏపీకి మూడుకు మధ్య లింకు లంకెబిందుల మాదిరి మారే పరిస్థితి. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత నుంచి మూడు మీద చర్చ అంతకంతకూ పెరుగుతోంది.

తరచి చూస్తే.. ఏపీకి మూడు బాగా అచ్చొచ్చినట్లుగా కనిపించిక మానదు. ఏపీలో ముగ్గురు ముఖ్యనేతలు ఉన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అందులో ఒకరైతే.. విపక్ష నేత చంద్రబాబు రెండోవారు. ముచ్చటగా మూడో వ్యక్తి జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఏపీ స్వరూపాన్ని చూస్తే.. మూడు ప్రాంతాలతో ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. అనంతపురం నుంచి కర్నూలు వరకూ నాలుగు జిల్లాలతో కలిపిన ప్రాంతాన్ని రాయలసీమగా.. నెల్లూరు మొదలుకొని గోదావరి జిల్లాల వరకూ కోస్తాగా.. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకూ ఉన్న ప్రాంతాన్ని ఉత్తరాంధ్రగా పిలవటం మర్చిపోకూడదు. మూడు ప్రాంతాలతో కలిసిన రాష్ట్రంగా ఏపీని పలువురు అభివర్ణిస్తారు.

ఇప్పుడు ఈ మూడుకు రాజధానులు మూడు కావటం మంచిదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకటే రాజధాని ఉంటే డెవలప్ మెంట్ మొత్తం ఒకే చోట పోగుపడినట్లు ఉండిపోవటమే కాదు.. ప్రాంతాల మధ్య అసమానతలు పెరిగే వీలుందని చెబుతున్నారు. అదే .. మూడు చోట్ల మూడు రాజధానులుగా ఉంటే డెవలప్ మెంట్ మూడు చోట్ల పెరుగుతుందన్న అభిప్రాయం ఉంది.

మూడుతో ఏపీకి ఇంతేనా అనుబంధం అంటే ఇంకా ఉందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం కూడా ఏపీ రాజకీయాన్ని ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుస్తుందన్నది మర్చిపోకూడదు. రానున్న రోజుల్లో ఏపీకి మూడుతో మరింత అనుబంధం ఉండటం ఖాయమనే చెప్పాలి.