Begin typing your search above and press return to search.

వైఎస్ జగన్ కేబినెట్ః ముగ్గురు శ్రీనివాస్ లు, ముగ్గురు నానిలు!

By:  Tupaki Desk   |   9 Jun 2019 1:30 AM GMT
వైఎస్ జగన్ కేబినెట్ః ముగ్గురు శ్రీనివాస్ లు, ముగ్గురు నానిలు!
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్ లో మంత్రుల పేర్లు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. కేవలం రెండు పేర్లతోనే ఏకంగా ఆరు మంది నేతలు ఉండటం గమనార్హం. వారిలో ముగ్గురివి ముద్దు పేర్లు, వారి అసలు పేర్లు వేరే ఉన్నాయి. మరో ముగ్గురి అసలు పేర్లు మాత్రం ఒకే రకంగా ఉన్నాయి.

పేర్ని నాని, ఆళ్ల నాని, కొడాలి నాని.. ఈ ముగ్గురూ జగన్ కేబినెట్లో స్థానం సంపాదించారు. వీరిలో కొడాని నాని అసలు పేరు, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, ఆళ్ల నాని అసలు పేరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, పేర్ని నాని అసలు పేరు పేర్ని వెంకట్రామయ్య.

ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్.. వీరి ముగ్గురు పేర్లలోనూ ‘శ్రీనివాస్’ కామన్ గా ఉంది.

మరో ఆసక్తిదాయకమైన అంశం.. ఆళ్ల నాని అసలు పేరులో కూడా శ్రీనివాస్ ఉంది. ఆయన పూర్తి పేరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్. ఈ రకంగా చూస్తే నలుగురి అధికారిక పేర్లలో ‘శ్రీనివాస్’ ఉండటం యాదృచ్ఛికం!