Begin typing your search above and press return to search.

ఇటలీలో ఎవరైనా బయటకొస్తే 3 నెలల జైలు.. భారీ జరిమానా?

By:  Tupaki Desk   |   9 March 2020 4:56 AM GMT
ఇటలీలో ఎవరైనా బయటకొస్తే 3 నెలల జైలు.. భారీ జరిమానా?
X
కరోనా కలకలం అంతకంతకూ పెరుగుతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచంలోని పలుదేశాలకు పాకటం తెలిసిందే. ఊహించని రీతిలో చైనా తర్వాత అంతే తీవ్రంగా ప్రభావితమైన దేశంగా ఇప్పుడు ఇటలీ అందరి నోళ్లల్లో నానుతోంది. ఈ బుజ్జి దేశం ఇప్పుడు కరోనా కారణంగా వణికి పోతోంది. మన దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధిక భాగం ఇటలీ నుంచి దేశానికి వచ్చిన వారు.. ఇటలీ యాత్రికుల కారణంగా నమోదైనవే అన్నది మర్చిపోకూడదు.

కరోనా బాధితుల సంఖ్య.. ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఇటలీలో ప్రమాదకర స్థాయికి కరోనా వ్యాప్తి చెందిందన్న వాదన వినిపిస్తోంది. దేశ జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరు చొప్పున కరోనా లక్షణాలుకనిపిస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. దీంతో.. 1.5కోట్ల మందిని నిర్భందంలో ఉంచేశారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న లాంబర్డీ ప్రాంతంలో జనజీవన పూర్తిగా స్తంభించింది.

టూరిస్టులు ఆ దేశం వంక చూసేందుకు చూసేందుకు ఇష్ట పడటం లేదు. పర్యాటక ప్రదేశాలు పూర్తిగా బోసి పోయాయి. ఇటలీ లో కరోనా వైరస్ వ్యాప్తికి కఠిన చర్యలు ఇప్పుడా దేశం చేపట్టింది. అత్యవసర పరిస్థితుల్లో తప్పించి ప్రజలెవరో బయటకు రాకూడదన్న నిషేధాన్ని విధించారు. ఇందుకు భిన్నంగా ఎవరైనా బయటకు వస్తే వారికి మూడు నెలల జైలుశిక్ష.. 206 యూరోలా ఫైన్ విధిస్తామని వార్నింగ్ జారీ చేయటమంటే.. పరిస్థితి ఎలా ఉందన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇటీలలో ఇప్పటి వరకూ 366 మంది మరణిస్తే.. ఒక్క ఆదివారమే 133 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు. గడిచిన 24 గంటల్లో మరో 1500 మందికి వైరస్ సోకినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఇటలీ పరిణామాలు ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఆదివారం కొత్తగా 40 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

ఈ వైరస్ వ్యవహారం బయట కు వచ్చిన తర్వాత ఒక రోజులో ఇంత తక్కువ కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. మొత్తంగా చైనా లో బాధితుల సంఖ్య 80,700కు చేరింది. ఆదివారం 22 మంది చైనాలో మరణించారు. మొత్తంగా ఈ పిశాచి కారణంగా ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 3119కు చేరుకున్నాయి.

అగ్ర రాజ్యమైన అమెరికాలోనూ కరోనా ఇబ్బంది తో కిందా మీదా పడుతోంది. ఈ దేశంలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 500 దాటింది. ఒక్క న్యూయార్క్ లోనే 100కు పైగా కేసులు నమోదు కావటం గమనార్హం.