Begin typing your search above and press return to search.

అబ్దుల్ కలాం చొరవతోనే 2-డీజీ ఔషధం

By:  Tupaki Desk   |   22 May 2021 1:30 PM GMT
అబ్దుల్ కలాం చొరవతోనే 2-డీజీ ఔషధం
X
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిన నేపథ్యంలో, డీఆర్‌ డీఓ విడుదల చేసిన 2డీజీ మందుపై వైద్య నిపుణులు దృష్టి సారించారు. త్వరలోనే కరోనా చికిత్సలో దీన్ని చేర్చే అవకాశాలు ఉన్నాయి. ర దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ యాంటీ కోవిడ్ డ్రగ్‌ పూర్తి పేరు.. 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్. దీన్నే 2-DG అని పిలుస్తున్నారు. ఈ మందుల మొదటి బ్యాచ్‌ ను ఇప్పటికే విడుదల చేశారు. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మే 1న దీనికి అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. కరోనా వైరస్ ప్రభావం మధ్యస్థం నుంచి తీవ్రంగా ఉండే రోగుల శరీరంలో ఆక్సిజన్ స్థాయులు పడిపోకుండా ఇది కాపాడుతుందని డీఆర్‌ డీఓ పరిశోధకులు తెలిపారు. హైదరాబాద్‌ కు చెందిన ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ సహకారంతో DRDO ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. సంస్థకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ ల్యాబ్.. 2-డీజీ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. కరోనా తో బాధపడుతున్న ప్రజలకు ఈ ఔషధం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని డీఆర్‌ డీఓ తెలిపింది.

2-డీజీ ఔషధం ఒక రకమైన గ్లూకోజ్ వంటిది. ఇలాంటి జెనరిక్ మాలిక్యూల్‌ను సలభంగా తయారు చేయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడం ద్వారా వేగంగా వ్యాధిని నయం చేసే అవకాశం ఉంటుంది. పొడి రూపంలో ఉండే ఈ మందును సాచెట్‌లలో ప్యాకింగ్ చేస్తున్నారు. దీన్ని నీటిలో కలుపుకొని తాగితే చాలు... ఆ తరువాత మందు పనిచేయడం ప్రారంభిస్తుంది.2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ కరోనా ఔషధాన్ని డీఆర్‌ డీఓ గ్వాలియర్ 25 ఏళ్ల క్రితమే రూపొందించిందని ఆ సంస్థ మాజీ శాస్త్రవేత్త డా. కరుణ్ శంకర్ వెల్లడించారు. ఈ డ్రగ్ అణువును రూపొందించాలని ఆనాటి డీఆర్‌ డీఓ డైరెక్టర్ అబ్దుల్ కలాం సూచించారని తెలిపారు. క్యాన్సర్ చికిత్స లో వాడే దీని కోసం అప్పటినుండి అమెరికా పై ఆధారపడటం మానేసాం అని అన్నారు. దీనికి 1998 లో పేటెంట్ రాగా 2002 డ్రగ్ కి ఆమోదం లభించింది.