Begin typing your search above and press return to search.

ఏపీలో 2758 గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్

By:  Tupaki Desk   |   6 Feb 2020 8:00 PM IST
ఏపీలో 2758 గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్
X
ఆంధ్రప్రదేశ్‌ లో భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద‌ 2758 గ్రామాల‌కు బ్రాడ్‌ బ్యాండ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే తెలిపారు. రాజ్యసభలో గురువారం వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ధోత్రే రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. దేశంలోని రెండున్నర లక్షల గ్రామ పంచాయతీలను కలుపుతూ దశలవారీగా బ్రాడ్ బ్యాండ్ సదుపాయం కల్పించాలన్నది భారత్ నెట్ ప్రాజెక్ట్ ఉద్దేశ్య‌మ‌ని ధోత్రే చెప్పారు.

భారత్ నెట్ మొదటి దశ కింద ఆంధ్రప్రదేశ్‌ లోని చిత్తూరు - విశాఖపట్నం జిల్లాల్లో 1722 గ్రామ పంచాయతీలలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు చేపట్టినట్లు మంత్రి ధోత్రే చెప్పారు. ఇందులో 1601 గ్రామ పంచాయతీలలో బ్రాడ్ బ్యాండ్ సేవ‌లు సిద్ధమ‌య్యాయని, మిగిలిన గ్రామాలలో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.