Begin typing your search above and press return to search.

కరోనా నిబంధనలు బేఖాతరు : నైట్ క్లబ్బులపై దాడులు 275 మంది అరెస్ట్ !

By:  Tupaki Desk   |   16 Dec 2020 11:10 AM IST
కరోనా నిబంధనలు బేఖాతరు : నైట్ క్లబ్బులపై దాడులు 275 మంది అరెస్ట్ !
X
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో జన జీవనం పూర్తిగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లాక్ డౌన్ నుండి సడలింపులు ఇవ్వడం తో కొంచెం కొంచెం మళ్లి పాత రోజులు వస్తున్నాయి. అయితే , ఇంకా కరోనా జోరు పూర్తిగా తగ్గలేదు. ఇంకా దేశంలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటించాలని సంబంధిత అధికారులు చెప్తున్నారు. కానీ, కొందరు మాత్రం యథేచ్ఛగా కరోనా నియమాలు తుంగలో తోక్కేస్తున్నారు. ఈ తరుణంలో కరోనా నియమాలు పాటించకుండా నైట్ క్లబ్బులపై ముంబై నగరపాలక సంస్ధ అధికారులు సోమవారం రాత్రి దాడులు చేశారు.

నాలుగు క్లబ్బులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వారి వద్దనుంచి 43,200 రూపాయలు జరిమానాగా వసూలు చేశారు. ఒక నైట్ క్లబ్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. కరోనా నిబంధనలు అమలు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని, క్లబ్ యజమానులు తమ పద్దతి మార్చుకోకపోతే అర్ధరాత్రి నుంచి తెల్లవారు ఝామువరకు కర్ఫ్యూ విధిస్తామని బీఎంసీ కమీషనర్ ఇక్బాల్ సింగ్ ఇప్పటికే హెచ్చరించారు.అయినప్పటికీ క్లబ్ యాజమానుల్లో మార్పురాలేదు . కస్టమర్ల నిర్లక్ష్యం వల్ల మళ్లీ కరోనా వ్యాప్తిచెందే అవకాశం ఉంది. నియమాలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఇక్బాల్ సింగ్ సూచించారు.

సోమవారం రాత్రి బీఎంసీ అధికారులు దాదర్ ‌లోని ప్రీతం హోటల్, తూర్పు బాంద్రా, మలాడ్, కాందివలిలోని నైట్‌ క్లబ్బుల్లో కరోనా నియమాలు ఉల్లంఘించి పార్టీ చేసుకోవడం, డ్యాన్స్‌లు చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో నైట్‌ క్లబ్ లో 50 మందికే అనుమతి ఉంది. కానీ, 100–150 పైనే అందులో కస్టమర్లు ఉన్నారు. అనేక మంది మాస్క్‌ ధరించలేదు. సామాజిక దూరాన్ని అసలు ఎవరూ పాటించటంలేదు. దీంతో 275 మందిని అదుపులోకి తీసుకుని క్లబ్‌ యాజమాన్యాలకు షోకాజ్‌ నోటీసులతోపాటు జరిమానా విధించారు.