Begin typing your search above and press return to search.

26/11 ముంబై ఎటాక్..లష్కర్‌ తొయిబా ఆపరేషన్స్‌ కమాండర్‌ లిఖ్వీ అరెస్ట్!

By:  Tupaki Desk   |   2 Jan 2021 6:31 PM IST
26/11 ముంబై ఎటాక్..లష్కర్‌ తొయిబా ఆపరేషన్స్‌ కమాండర్‌ లిఖ్వీ  అరెస్ట్!
X
26/11 ముంబై ఉగ్రవాద దాడి .. భారతదేశ చరిత్రలో అదో చీకటి సంఘటన. తరతరాలు గుర్తుండిపోయే దుర్ఘటన. ఎంతోమంది చనిపోగా , కొన్ని వేల మంది తీవ్ర గాయాలపాలైయ్యారు, అలాగే ఎంతోమంది నిరాశ్రయులైయ్యారు. తాజాగా ఈ కేసు కీలక సూత్రధారి, లష్కర్‌ తొయిబా ఆపరేషన్స్‌ కమాండర్‌ జకీ ఉర్‌ రెహమాన్‌ లఖ్వీని పాకిస్థాన్‌ శనివారం అరెస్టు చేసింది. టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ ఆరోపణలపై లఖ్వీని అరెస్టు చేసినట్లు పాక్‌ పోలీసులు తెలిపారు.

ముంబై దాడుల కేసుల్లో 2015 నుంచి లఖ్వీ బెయిల్‌ పై ఉన్నాడు. అతనిని శనివారం కౌంటర్‌ టెర్రరిజం డిపార్ట్‌ మెంట్‌ అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే జకీ ఉర్‌ రెహమాన్‌ లఖ్వీని ఎక్కడ అరెస్టు చేసింది పాక్‌ అధికారులు మాత్రం ఇంకా నిర్దారించలేదు . 2008 నవంబర్‌ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో 10 మంది లష్కరే తొయిబా ఉగ్రవాదులు పాల్గొన్నారు. ముంబై వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు 12 రోజులు దాడులు జరిపారు. ఈ ఉగ్రదాడుల్లో 9 మంది ఉగ్రవాదులతో సహా 174 మంది వరకు మృతి చెందారు. ఈ దాడుల్లో కసబ్‌ పట్టుబడ్డాడు. సుదీర్ఘ న్యాయ విచారణ తర్వాత చట్ట ప్రకారం మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రవాదులంతా పాక్ ‌ కేంద్రంగా పని చేస్తున్న లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా కసబ్‌ వెల్లడించారు.