Begin typing your search above and press return to search.

ఏపీ అంటే ఇదా? 448 ఇళ్లు ఉన్న ఆ ఊళ్లో 252 మందికి ఫించన్లు

By:  Tupaki Desk   |   31 May 2023 10:22 AM GMT
ఏపీ అంటే ఇదా? 448 ఇళ్లు ఉన్న ఆ ఊళ్లో 252 మందికి ఫించన్లు
X
ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అన్న భావన తాజా ఉదంతం గురించి తెలిసినంతనే మనసు కు కలగటం ఖాయం. సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వాని కి అధిక ప్రాధాన్యత ఇవ్వటం తప్పు కాదు. అయితే.. ప్రజలు చెల్లించే పన్నుల్ని ఖర్చు పెట్టే వేళలో.. పైసా పైసా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాల బడ్జెట్లు లక్షల కోట్ల రూపాయిలుగా మారిపోవటం.. అందు లోని సింహ భాగం సంక్షేమ పథకాల కు ఖర్చు చేస్తున్నప్పటికీ.. ఆర్థిక అసమానతల్లో తేడా రాకపోవటం.. రోజులు గడిచే కొద్దీ సంక్షేమం పేరుతో పెట్టే ఖర్చు అంతకంతకూ ఎక్కువ అవుతున్నదే తప్పించి తగ్గని పరిస్థితి. ఇది దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న.

రోజులు గడిచే కొద్దీ.. ప్రజల ఆర్థిక శక్తి పెరగటంలోనే కదా ప్రభుత్వ విజయం ఉంటుంది. అందుకు భిన్నంగా పరిస్థితులు ఉండే ఏమనాలి? ఎలా చూడాలి? అన్నదిప్పుడు ప్రశ్న. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ఒక రివ్యూలో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. గుంటూరు జిల్లా చింతపూడి గ్రామంలో 1650 మంది జనాభా ఉంది. అయితే.. ఇళ్ల విషయానికి వస్తే 448 ఇళ్లు ఉన్నాయి. అంటే.. ఇంటి కి సుమారుగా మూడున్నర మంది ఉన్నట్లుగా లెక్కలు చెబుతాయి.

అలాంటి ఊళ్లో నెల నెలా అందుతున్న ఎంతమందికి ఫించన్లు అందుతున్నాయి? అన్నది చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రభుత్వ లెక్కల ప్రకారం 252 మందికి నెల వారీగా పింఛన్ల ను ఇస్తున్న విషయాన్ని కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ అదనపు కార్యదర్శి చంద్రశేఖర్ కుమార్ పాల్గొన్న రివ్యూలో బయట కు వచ్చింది. దీంతో ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అయితే.. ఆయన ఆశ్చర్యాన్ని అధికారులు మరోలా అర్థం చేసుకోవటం విశేషం.

ఎందుకంటే.. 448 మంది ఇళ్లల్లో ని 252 మందికి నెలవారీ గా పింఛన్లు ఇవ్వటం అంటే.. సగం కంటే ఎక్కువ ఇళ్లు పింఛన్ల పథకం ద్వారా లబ్థి పొందుతున్నట్లే. గుంటూరు జిల్లా లాంటి ధనిక జిల్లాలో ఇంతటి ఇబ్బందికర పరిస్థితి ఉందా? అన్నది ఒక ప్రశ్న అయితే.. గ్రామంలో ఉన్న ఇళ్లల్లో సగాని కి పైగా నెలవారీ పింఛన్ల లబ్థిదారులు ఉండటం విస్మయానికి గురి చేయక మానదు.

అంటే.. ప్రతి రెండు ఇళ్లల్లో ఒకటిన్నర మంది పింఛన్ లబ్థిదారులు ఉన్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి వీరిలో అర్హత ఎంతమందికి ఉందన్న విషయాన్ని అకస్మిక తనిఖీ రూపంలో చేపడితే.. విలువైన ప్రజా ధనం పక్కదారి పట్టకుండా ఉంటుందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.