Begin typing your search above and press return to search.
2,500 ఏళ్ల తరువాత 'మమ్మీ' ని బయటకు తీశారు.. ఎలా ఉన్నదంటే ?
By: Tupaki Desk | 7 Oct 2020 8:00 AM ISTఈజిప్ట్ చరిత్ర ఓ బ్రహ్మాండం. దాని గురించి అంతా తెలిసినట్లే ఉంటుంది కానీ , ఇంకా తెలియని రహస్యాలు చాలా అలాగే మిగిలిపోతాయి. మూడువేల ఏళ్ల క్రితం అంతెత్తున పరిమిడ్‌లను కట్టిన చక్రవర్తులు తమ దేహాలను పరిరక్షించుకోవడం కోసం దాచుకున్నారు. దొంగలకు దొరక్కుండా ఎక్కడెక్కడో దాచారు. వాళ్లతోపాటు ఈజిప్ట్ రహస్యమూ దాగిపోయింది. ప్రాచీన ఈజిప్ట్ చరిత్రలో కలప, గ్రానైట్‌తో చేసిన శవపేటికల్లో ఆనాటి గొప్పవాళ్ల దేహాలను ఖననం చేసేవాళ్లు. గ్రీసు, రోమ్‌లోనూ ఇదే ప్రాచీన సంప్రదాయముంది. ఇక ఈజిప్ట్ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది ఈజిప్ట్ మమ్మీ.
ఏళ్ల నాటి మమ్మీలను వెలికి తీసి వాటి చరిత్రను తవ్వి తీయడంలో ఆ దేశ శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సంవత్సరం మొదట్లో సక్కారా ప్రాంతంలో 59 మమ్మీలను వెలికి తీశారు. సక్కారా అనేది ఈజిప్టులో విస్తారమైన, పురాతన శ్మశానవాటిక. ఇక్కడ వెలికి తీసిన మమ్మీలు దాదాపు 2,500 ఏళ్ల క్రితానికి చెందినవిగా వారు గుర్తించారు. అందులో శనివారం రోజున ఓ శవపేటికను ఈజిప్టు పురావస్తు శాస్త్రవేత్తలు తెరిచారు. ఆ శవపేటికలు , అందులోని మమ్మీలు కూడా చెక్కుచెదరకుండా ఉండటాన్ని గుర్తించారు. ఇవి ఈజిప్టు సమాజంలోని పూజారులు, ఇతర గొప్ప వ్యక్తులువిగా గుర్తించారు. ఆ శవపేటికలు , మమ్మీలకి సంబంధించిన వీడియోను ఈజిప్ట్ పర్యాటక, పురావస్తు మంత్రిత్వ శాఖ తన ఖాతాలో పోస్ట్ లో చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
ఈజిప్టులోని న్యూజిలాండ్ రాయబారి గ్రెగ్ లూయిస్ కూడా శనివారం ట్విటర్ లో అన్ సీలింగ్ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో శవపేటికలో మమ్మీ వస్త్రంతో కప్పబడి, ఏమాత్రం పాడవకుండా ఉంది. ఈ వీడియో పై సోషల్ మీడియాలో నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈజిప్టు పర్యాటక, పురాతన మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం మొదట 13 శవపేటికలతో మూడు బావులు సక్కారాలో కనుగొనబడ్డాయి. ఆ తర్వాత మరో 14 శవపేటికలు బయటపడ్డాయి. అలా ఈ రోజు వరకు మొత్తం 59 శవపేటికలను వెలికితీశారు. వీటిని మ్యూజియం లో ప్రదర్శనకి ఉంచారు.