Begin typing your search above and press return to search.

25మంది ఏపీ మంత్రుల్లో పార్టీ మారకుండా ఉంది కేవలం అంతమందేనా?

By:  Tupaki Desk   |   30 Sept 2020 5:40 PM IST
25మంది ఏపీ మంత్రుల్లో పార్టీ మారకుండా ఉంది కేవలం అంతమందేనా?
X
అసలు వైసీపీలో ఎదిగిన వారు ఎవరు? అరువు వచ్చిన నేతలు ఎవరు.? వైసీపీనే నమ్ముకొని ఉన్న వారిలో ఎంతమందికి న్యాయం జరిగింది? ఎంతమందికి మంత్రి పదవులు వచ్చాయి? ఇప్పుడు ప్రశ్నలు వైసీపీ సోషల్ మీడియాలో.. క్షేత్రస్థాయి నేతల్లో వ్యక్తమవుతున్నాయి. అందరి మంత్రుల చరిత్ర తీసి చూస్తే షాకింగ్ విషయం ఒకటి బయటపడింది. వైసీపీనే నమ్ముకొని ఆ పార్టీలో నీడలో ఎదిగిన వారిలో కొందరికే మంత్రి పదవులు దక్కాయన్న విషయం తేటతెల్లమైంది.

కేవలం ఏడుగురు మాత్రమే పార్టీ మారకుండా డైరెక్టుగా వైసీపీ నుంచి మంత్రులు అయిన వారు ఉన్నారు. మిగతా వారు అంతా ఏదో ఒక పార్టీ నుంచి వైసీపీలోకి అరువు వచ్చిన నేతలే కావడం గమనార్హం. వైసీపీపై ముందునుంచి అభిమానం లేని వాళ్లు ఇక వైసీపీ నేతలకు ఇప్పుడు ఏం చేస్తారని క్షేత్రస్థాయిలో నేతలు వాపోతున్నారు. ఎందుకంటే వాళ్లకు అన్ని పార్టీలతో పరిచయాలు ఉన్నాయి. అందుకే వైసీపీ జెండా మోసి.. జగన్ ను నమ్ముకున్న వాళ్లకు ఇప్పుడు పనులు కావడం లేదు అని వైసీపీ కేడర్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

వైసీపీ మంత్రుల చిట్టా చూసినా అదే విషయం మనకు బోధపడుతోంది. ఒక్కసారి వైసీపీ మంత్రుల ఇన్ఫర్మేషన్ చూస్తే.. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేస్తున్న వైసీపీ నేతలకు క్షేత్రస్థాయిలో పనులు కావడం లేదని పెద్దఎత్తున గ్రామాల్లో మాట్లాడుకుంటున్నారు. నిజమైన వైసీపీ వాళ్లకు పనులు చేయాలని.. వైసీపీ గ్రామ నాయకులు - కార్యకర్తలు - బూత్ స్థాయి లీడర్లు అనుకుంటున్నారు. చూద్దాం జంప్ జిలానీలకు చేస్తారో.. రియల్ వైసీపీని నమ్ముకున్న వారికి పనులు చేస్తారా అని గ్రామాల్లో అరుగుల మీద కూర్చొని పాపం వైసీపీ నేతలు బాధలు పంచుకుంటున్నారట..

ప్రస్తుతం జగన్ కేబినెట్ ను చూస్తే ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చి మంత్రులయ్యిందనేది అందరికీ అర్థమవుతోంది. 25మంది మంత్రుల్లో కేవలం ఏడుగురు మాత్రమే వైసీపీలో పుట్టి.. వైసీపీలో ఎదిగి మంత్రులయ్యారు. వారికి మాత్రమే వైసీపీ వాళ్ల కష్టాలు తెలుస్తాయని.. మిగతా వారంతా పక్క పార్టీ నుంచి రావడంతో వారికి మా బాధలు అర్థం కావు అని అంటున్నారు.

ఒక్కసారి ఏపీ కేబినెట్ మంత్రుల లిస్ట్ చూస్తే ఇదే అర్థమవుతుంది. ఈ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరి నోట చర్చకు దారిస్తోంది.

* సీఎం జగన్ ను తప్పిస్తే.. వైసీపీ 25 మంత్రుల్లో ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చారో తెలుసుకుందాం..

+ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్

1. ఏ. కలి కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) - ఏలూరు --- కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి చేరాడు.
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

2. ధర్మాన కృష్ణదాస్ - నరసన్నపేట --- కాంగ్రెస్ నుంచి వైసీపీ
రెవెన్యూ - స్టాంప్ - రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి

3. పాముల పుష్ప శ్రీవాణి - కురుపాం --- స్వతహాగా వైసీపీ మంత్రి
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి

4. కే. నారాయణ స్వామి - గంగాధర నెల్లూరు ---- కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి..
ఎక్సైజ్ - మరియు కమర్షియల్ ట్యాక్స్ మంత్రి

5. అంజద్ భాష షేక్ బెపారి - కడప --- స్వతహాగా వైసీపీ మంత్రి
మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి

+ కేబినెట్ మంత్రులను చూస్తే..

6. మేకతోటి సుచిరిత - ప్రత్తిపాడు -- కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి..
ఏపీ హోంమంత్రి

7. బుగ్గన రాజేంద్రనాత్ - ధోన్ -- స్వతహాగా వైసీపీ మంత్రి
ఏపీ ఆర్థిక - శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి

8. పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి - పుంగనూరు --- కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి..
పంచాయతీరాజ్ - గ్రామీణ అభివృద్ధి - గనుల శాఖ మంత్రి

9. బొత్స సత్యానారాయణ - చీపురుపల్లి --- కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి..
మున్సిపల్ - పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

10. మలగుండ్ల శంకరనారాయణ - పెనుకొండ -- స్వతహాగా వైసీపీ
రోడ్లు - భవనాల శాఖ మంత్రి

11. బాలినేని శ్రీనివాస్ రెడ్డి - ఒంగోలు --- కాంగ్రెస్ నుంచి వైసీపీ
విద్యుత్ - అటవీ పర్యావరణం - సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి

12. ఆదిమలుపు సురేష్ - యెర్రగొడ్డపాలెం -- కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి..
విద్యా - మానవ వనరుల శాఖ మంత్రి

13. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ -- కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి..
సాగునీటి పారుదల శాఖ మంత్రి

14. మేకపాటి గౌతం రెడ్డి - ఆత్మకూరు --కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి..
పరిశ్రమలు - ఇన్ఫర్మేషన్ - టెక్నాలజీ శాఖ మంత్రి

15. కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు(నాని) - గుడివాడ --టీడీపీ నుంచి వైసీపీలోకి..
పౌరసరఫరాల శాఖ మంత్రి

16. పి. వెంకటరామయ్య (పేర్నినాని) మచిలీపట్నం -- కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి..
రవాణా - ఇన్ఫర్మేషన్ - పబ్లిక్ రిలేషన్ శాఖ మంత్రి

17. వెల్లంపల్లి శ్రీనివాస్ - విజయవాడ వెస్ట్ -- పీఆర్పీ టు కాంగ్రెస్ టు వైసీపీ
దేవాదాయ శాఖ మంత్రి

18. తానేటి వనిత - కొవ్వూరు- స్వతహాగా వైసీపీ
మహిళా శిశు సంక్షేమం

19. చెరుకువాడ శ్రీరంగనాధ రాజు - అచంట -- కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి..
గృహ నిర్మాణ శాఖ మంత్రి

20. ఎం. శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) - భీమిలి -- పీఆర్పీ టు టీడీపీ టు వైసీపీ
పర్యాటకం - యువజన సంక్షేమ శాఖ మంత్రి

21. కురసాల కన్నబాబు కాకినాడ రూరల్ ----పీఆర్పీ -కాంగ్రెస్-వైసీపీ
వ్యవసాయం - మార్కెటింగ్ - సహకార శాఖ మంత్రి

22. పినిపె విశ్వరూప్ - అమలాపురం --- కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి..
సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి (సోషల్ వెల్ఫేర్)

23. గమ్మునూర్ జయరాం ఆలూర్ -- పీఆర్పీ నుంచి వైసీపీలోకి..
కార్మిక - ఉద్యోగ - శిక్షణ శాఖ మంత్రి

24. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ - రాంచంద్రాపురం- స్వతహాగా వైసీపీ
బీసీ సంక్షేమ శాఖ మంత్రి

25. డా. సీదెరి అప్పలరాజు - పలాస -- స్వతహాగా వైసీపీ
మత్స్య - డెయిరీ శాఖ మంత్రి