Begin typing your search above and press return to search.

ఆ ‘భారత విద్యార్థుల్ని’ వెళ్లిపొమ్మన్న అమెరికా వర్సిటీ

By:  Tupaki Desk   |   7 Jun 2016 5:12 PM GMT
ఆ ‘భారత విద్యార్థుల్ని’ వెళ్లిపొమ్మన్న అమెరికా వర్సిటీ
X
కోటి కలలతో.. అమెరికాలో ఉన్నత విద్యాభాస్యం కోసం వచ్చిన విద్యార్థుల్లో పాతికమంది భారతీయ విద్యార్థుల్ని తిరిగి వారి స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవాలంటూ అమెరికాలోని వెస్టర్న్ కెంటకీ వర్సిటీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ చేయటానికి వచ్చిన పాతిక మంది విద్యార్థులను వెనక్కి వెళ్లిపోవాలని.. లేదంటే వేరే విద్యాసంస్థలో ఆడ్మిషన్ తీసుకోవాలంటూ వర్సిటీ తేల్చి చెప్పింది.

అంతర్జాతీయ రిక్రూటర్ల ద్వారా స్పాట్ ఆడ్మిషన్ల ద్వారా తీసుకున్న భారత విద్యార్థులు 60 మంది ఈ ఏడాది జనవరిలో కోర్సులు చేరేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 40 మంది కనీస ప్రమాణాలు అందుకోలేకపోయారంటూ వర్సిటీ ఛైర్మన్ జేమ్స్ గ్యారీ వెల్లడించారు. గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన విద్యార్థికి ఉండాల్సిన కనీస ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా విద్యార్థులకు లేవని వ్యాఖ్యానించటం గమనార్హం. తాజా ఉదంతం నేపథ్యంలో ఇకపై భారతీయ విద్యార్థులకు ఆడ్మిషన్లు ఇచ్చే ముందు తమ అధ్యాపక బృందం భారత్ కు వెళ్లి విద్యార్థులు అకడమిక్ రికార్డుల్ని పరిశీలించిన తర్వాతే ఆడ్మిషన్లు ఇస్తామని పేర్కొనటం గమనార్హం. కెంటకీ వర్సిటీ తాజా నిర్ణయంతో పాతిక మంది విద్యార్థుల భవితవ్యం ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో నిలబెట్టినట్లైందని చెప్పాలి.