Begin typing your search above and press return to search.

మ‌న ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను చూసి జాలిప‌డ‌దాం!

By:  Tupaki Desk   |   17 Feb 2017 6:40 AM GMT
మ‌న ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను చూసి జాలిప‌డ‌దాం!
X
పూర్తి నిజం చెప్ప‌క‌పోయినా ప‌ర్లేదు కానీ అవాక్క‌య్యే స్థాయిలో అబ‌ద్దం చెపితే ఎలా ఉంటుంది? అస్స‌లు బాగోదు క‌దా! పైగా ప్ర‌జా సేవ‌లో ఉన్నాం అని ప్ర‌క‌టించుకునే నాయ‌కులు ప‌క్కాగా త‌ప్పుడు లెక్క‌లు చెపితే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇలాంటివేవీ ప‌ట్టించుకోకుండా మ‌నం ఎన్నుకున్న ప్ర‌జాప్ర‌తినిధులైన ఎంపీ, ఎమ్మెల్యేలు దొంగ లెక్క‌లు చెప్పేశారు. ఎవ‌రికి చెప్పారు, ఎలా చెప్పారనే క‌దా మీ సందేహాం? సాక్షాత్తు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి త‌మ ఆదాయాన్ని వెల్ల‌డించ‌డం ద్వారా మ‌నం ఎన్నుకున్న నాయ‌కులు వివ‌రాలు ఇచ్చారు.

ప్ర‌స్తుత నిబంధ‌న‌ల ప్ర‌కారం రూ.2.5 ల‌క్ష‌ల లోపు ఆదాయ‌పు ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేని సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌కారం మ‌న దేశ ప్ర‌జాప్రతినిధుల్లో 35 శాతం మంది అయితే పన్ను చెల్లించనవసరం లేనంతగా రూ.2.5 లక్షల కంటే తక్కువ చూపించారు. 40 శాతం మంది 2.5 నుంచి 10 లక్షల మధ్య త‌మ ఆదాయం ఉంద‌ని ప‌త్రాలు స‌మ‌ర్పించారు. 72 శాతం మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఆదాయం రూ.10 లక్షల కంటే త‌క్కువే అని చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ఈ షాకింగ్ వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇక 24 శాతం మంది తమకు ఎలాంటి ఆదాయం లేదని ప్ర‌క‌టించారు. అంటే...2.5 లక్షల పన్ను మినహాయింపు పరిధిలోని వ‌చ్చే 35 శాతం మంది ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఈ 24 శాతం మంది కలిపితే 59 శాతం మంది మ‌నం ఎన్నుకున్న నాయ‌కులు అసలు పన్ను చెల్లించలేడం లేదన్న మాట‌.

ఈ లెక్క‌ల ప్ర‌కారం మ‌ధ్య త‌ర‌గ‌తి, ఎగువ మ‌ధ్య‌త‌ర‌గతి జీవుల్లో ఆదాయ‌పు ప‌న్ను క‌డుతున్న వారి కంటే కూడా మ‌న ప్ర‌జా ప్ర‌తినిధుల్లో మెజార్టీ బికారులు అన్న‌మాట‌!! ఇలాంటి ప‌రిస్థితి ఉంది కాబ‌ట్టే స్వాతంత్ర్యం వ‌చ్చి అర్ధ శ‌తాబ్దాం దాటిపోయినా ఇంకా మ‌నం 'అభివృద్ధి చెందుతున్న' దేశంగానే ఉన్నాం త‌ప్పించి అభివృద్ధి బాటలో స‌త్తా చాట‌డం లేదు. ఏమంటారు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/