Begin typing your search above and press return to search.

కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు.. రోజుకు 2.47 లక్షల కేసులు

By:  Tupaki Desk   |   13 Jan 2022 5:53 AM GMT
కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు.. రోజుకు 2.47 లక్షల కేసులు
X
చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా రూపాలు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. ఇప్పటికే రెండు వేవ్ లతో విరుచుకుపడ్డ కరోనా.. తాజాగా మూడో వేవ్ తో దాడి చేస్తోంది. తాజాగా దేశంలో రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. మధ్యలో రెండు రోజులు తగ్గినా మళ్లీ భారీగా పెరిగాయి. తిరిగి ఇఫ్పుడు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,47,417 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

24 గంటల్లో రోజువారి కంటే 50వేల కేసులు పెరిగాయి. గడిచిన 8 నెలల కాలంలో తొలిసారిగా భారత్ రెండు లక్షల పాజిటివ్ కేసుల సంఖ్య దాటింది. రాజస్థాన్ లో ఒకేరోజు 10వేలకు పైగా కరోనా కేసులను గుర్తించారు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5488కు చేరింది. ఇక సాధారణ కేసులు రెండున్నర లక్షలు దాటాయి.

-నేడు ప్రధాని మోడీ సమీక్ష

దేశవ్యాప్తగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చ్యువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల వారీగా కరోనా కేసులు.. స్థితిగతులపై ఆరాతీస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో తీసుకుంటున్న నియంత్రణ, చికిత్సల చర్యలపైన వాకబు చేస్తారు. అదే సమయంలో కేంద్రం నుంచి అందాల్సిన సాయం.. నియంత్రణకు అమలు చేయాల్సిన ఆంక్షలపైన ముఖ్యమంత్రుల నుంచి అభిప్రాయం తీసుకోనున్నారు. ఆంక్షల అమలు దిశగా కసరత్తు చేస్తున్నారు.

-భారత్ లో డెల్టాను మించి ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఏ1..

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ ల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇటు భారత్ లోనూ డెల్టా వేరియంట్ స్థానంలో ఒమిక్రాన్ భర్తీ చేసిందని డబ్ల్యూ.హెచ్.ఓ పేర్కొంది.ఇక ఇండియాలో ఒమిక్రాన్ రూపాంతరం చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో కొత్త వేరియంట్ వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాని పేరు ఒమిక్రాన్ బీఏ1 జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన భారతీయ వైరాలజిస్టులు బీఏ1 ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. ఇండియాలో వచ్చిన సెకండ్ వేవ్ కు డెల్టా వేరియంట్ కారణం అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే ఐదు రెట్లు వేగంగా వ్యాపిస్తోంది.

-ఒమిక్రాన్ బారినపడ్డారో లేదో ఇలా తెలుసుకోవచ్చు..

ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు భిన్నంగా ఉన్నాయని పలు నివేదికల్లో వెల్లడైంది. ఒమిక్రాన్ బాధితుల్లో సాధారణంగా కనిపించే లక్షణాల్లో ఒళ్లు నొప్పులు, సాధారణ బలహీనత, అలసట, తలనొప్పి, జ్వరంతో లక్షణాలు ప్రారంభమవుతాయి. మెల్లగా దగ్గు మొదలవుతుంది. ఆ తర్వాత జలుబు, ముక్కు నుంచి నీరు కారడం.. తుమ్ములతో పాటు కొన్ని సార్లు ముక్కు నాశిక రంధ్రాలు ఎండిపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఒమిక్రాన్ సోకిన వారిలో సాధారణంగా పొడి దగ్గు వస్తుంటుంది. వైరస్ సోకిన కొద్దిరోజుల్లోనే ఈ లక్షణాలు తగ్గిపోతాయి. 80శాతం మంది బాధితుల్లో మొదటి మూడు రోజుల్లోనే జ్వరం కూడా తగ్గిపోతోంది. జ్వరం తగ్గిన తీవ్రమైన ఇన్ ఫెక్షన్ కు దారితీసే ప్రమాదం లేకపోలేదు.