Begin typing your search above and press return to search.

డ్రంకెన్ డ్రైవ్ లో ఎక్కువగా పట్టుబడుతున్నది వారేనట!

By:  Tupaki Desk   |   30 Sep 2019 6:40 AM GMT
డ్రంకెన్ డ్రైవ్ లో ఎక్కువగా పట్టుబడుతున్నది వారేనట!
X
హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ప్రతి వారాంతంలో నిర్వహించటం తెలిసిందే. మొన్నటి శుక్ర.. శనివారాల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలుచోట్ల డ్రైవ్ లు నిర్వహించారు. ఈ సందర్భంగా 236 కేసుల్ని నమోదు చేశారు. నమోదైన కేసుల్ని విశ్లేషించే క్రమంలో ఆసక్తికరమైన అంశాలు తెర మీదకు వచ్చాయి.

మొత్తం డ్రంకెన్ డ్రైవ్ లో కేసులు నమోదైన 236 మందిలో మైనర్లు ఒక్కరు కూడా లేరు. 21-30 ఏళ్ల మధ్య వయస్కులే భారీ ఎత్తున దొరికారు. 105 మంది ఈ వయస్కులు ఉంటే రెండో స్థానంలో 77 మంది 31-40 వయసులో ఉన్న వారున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 61-70 మధ్య వయస్కులు కూడా పట్టుబడ్డారు. అంత పెద్ద వయసులో బాధ్యత లేకుండా పట్టుబడిన వారు ముగ్గురున్నారు.

అత్యధిక కేసులు మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండగా.. తర్వాత కుకట్ పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిలిచింది. తర్వాతి స్థానం రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు ఉంటే.. ఐటీ ఉద్యోగులు 30 మంది ఉన్నట్లు గుర్తించారు. తర్వాతి స్థానంలో డ్రైవర్లు 29 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో ఇతరులు 95 మంది ఉండగా.. వారిలో అత్యధికులు ఫుడ్ డెలివరీ చేసే వారిగా గుర్తించారు. ప్రైవేటు ఉద్యోగులు 17 మంది పట్టుబడితే.. బిజినెస్ చేసే వారు 11 మంది ఉన్నట్లు గుర్తించారు.