Begin typing your search above and press return to search.

23 ఏళ్ల కిందటి ప్రేమ.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు..

By:  Tupaki Desk   |   23 May 2022 12:55 PM IST
23 ఏళ్ల కిందటి ప్రేమ.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు..
X
ప్రేమ ఎంతో మధురం.. ఇది అందరికీ దొరకడం అసాధ్యం.. అలాంటి ప్రేమ ఎవరిలో..? ఎప్పుుడు పుడుతుంది..? అంటే ఫలానా టైంలో అని ఎవరూ చెప్పలేదు. అంతేకాదు ప్రేమకు వయసు లేదు.. ఎప్పుడైనా మనసులు కలవొచ్చు.. అని కొందరు అంటారు.. అలా అన్నట్లుగానే ఇద్దరు వ్యక్తులకు జీవితం చివరిదశలో ప్రేమ పుట్టింది. వారి మనసులు కలిశాయి. ఒకరి హృదయం మరొకరి హృదయాన్ని అర్థం చేసుకోగలిగింది. దీంతో వారిద్దరు కలిసి ఒక్కటయ్యారు. ఉన్న కాస్త జీవితాన్ని కలిగి గడపాలని నిర్ణయించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి చేసుకున్న పురుషుడి వయస్సు 95.. మహిళ వయస్సు 84.. అసలు కథ ఏంటంటే..?

95 ఏళ్ల వయసు రాగానే ఎవరైనా సంతోషంగా కాలం గడుపుతారు. కొందరు ఆరోగ్యం సహకరించకపోతే మంచానికే పరిమితం అవుతారు. కానీ ఈ వయసులో ఉన్న ఓ వ్యక్తి తన 84 ఏళ్ల చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడు. అతికొద్దిమంది సమక్షంలో వీరు రింగులు మార్చుకున్నారు. కాలం పూర్తయ్యేవరకు కలిసుంటామని ప్రార్థనలు చేశారు.

23 సంవత్సరాల కిందట వారు ఇదే చర్చిలో కలుసుకున్నారు. కానీ వారిలో అప్పుడు ప్రేమ పుట్టేలేదు. వారి ప్రేమ పుట్టడానికి ఇంతకాలం పట్టింది.

జూలియన్ మోయిల్ అనే వ్యక్తి వయసు 95 ఏళ్లు. ఆయన జీవితంలో ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఎవరిపై ప్రేమ పుట్టలేదు. దీంతో పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు. నిజమైన ప్రేమ కోసం జీవితాంత అన్వేషించాడు. కానీ ఎక్కడా దొరకలేదు.

అయితే 23 సంవత్సరాల కిందట ఓ చర్చిలో వార్రీ విలియమ్స్ అనే అమ్మాయిని కలిశాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ తరువాత ప్రేమికులుగా మారిపోయారు. అప్పటి నుంచి తమ ఆలోచనలను పంచుకుంటున్న వీరు ఇటీవల ధైర్యం చేసిన పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

దీంతో 40 మంది దగ్గరి బంధువుల సమక్షంలో జాలియన్ మోయిల్, వార్రీ విలియమ్స్ పెళ్లి చేసుకున్నారు. ఈనెల 19న వారి వివాహం జరిగింది. ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్న వీరిద్దరు మిగిలిన జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. జూలియన్ ఓపెరా గాయకుడిగా పనిచేసేవాడు. దీంతో వారు ఆయన పెళ్లి తరువాత ఓపెరా సాంగ్ పాడారు. ఆ తరువాత వీరు హనీమూన్ ప్లాన్ కూడా వేసుకున్నట్లు సమాచారం.