Begin typing your search above and press return to search.

లేటు ప్రేమ: అతడికి 23, ఆమెకు 60 ఏళ్లు

By:  Tupaki Desk   |   12 Jun 2021 2:00 PM IST
లేటు ప్రేమ: అతడికి 23, ఆమెకు 60 ఏళ్లు
X
లేటు వయసులో ఈ బామ్మ ఘాటు లాంటి యువకుడిని పట్టేసింది. కులం, మతం, వయసు తేడాను పట్టించుకోకుండా అతడితో రోమాన్స్ ఎంజాయ్ చేస్తోంది. వీరి ప్రేమ వ్యవహారం ఆ నోట.. ఈ నోటా పాకి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆ ప్రేమ కహాని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అమెరికాకు చెందిన 60 ఏళ్ల బామ చెర్లి అనే ముసలావిడ.. 23 ఏళ్ల క్వారిన్ అనే యువకుడితో ప్రేమలో పడింది. అంతేకాదు.. వీరిద్దరూ రోమాన్స్ చేసుకుంటున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ముద్దులు, హగ్గులు, ఇంకేదో చేసుకుంటున్న వీరిని చూసి నెటిజన్లు ట్రోల్స్ మొదలుపెట్టారు.

తాజాగా తమ ప్రేమ వ్యవహారంపై ఆ జంట స్పందించింది. వయసు అనేది జస్ట్ నంబర్ మాత్రమేనంటూ నెటిజన్లకు బదులిచ్చింది. చెర్లి మాట్లాడుతూ ‘మా బంధం నిజాయితీతో కూడుకొని ఉంది. ఆకారం ముఖ్యం కాదు.. ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటున్నామన్నదే ముఖ్యం. అన్నింటికి మించి మనసు చూసి మేము ఒకరినొకరం ఇష్టపడ్డాం. నా కొడుకు క్వారిన్ కంటే మూడేళ్లు పెద్దవారు. వారు కూడా మా బంధాన్ని అర్థం చేసుకొని అంగీకరించారు. మేం ఏం తప్పు చేయడం లేదు. అస్సలు పట్టించుకోం’ అంటూ పెద్దావిడ విమర్శలను కొట్టిపారేసింది.

వీరిద్దరిని చూశాక ప్రేమ గుడ్దిది అని అనకమానరు. దానికి కులం మతం, వయోభేదం లేదని తేటతెల్లమైంది. ఎవరేమనుకున్న వీరి రోమాంటిక్ ఫొటోలు, వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.