Begin typing your search above and press return to search.
వైసీపీ నేతల టచ్ లో 23 మంది టీడీపీ అభ్యర్థులు
By: Tupaki Desk | 21 May 2019 8:00 PM ISTఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజేత ఎవరనే విషయం మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. దీంతో 43 రోజుల పాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడనుంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు తెలుగుదేశం - వైఎస్సార్ కాంగ్రెస్ విజయం తమదంటే తమదంటూ ధీమాను ప్రదర్శిస్తున్నాయి. ఇక, పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతామని చెబుతోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయం రంజుగా సాగుతోంది. వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచి రాష్ట్రంలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత కూడా కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి కొందరు అభ్యర్థులు భారీ షాక్ ఇవ్వబోతున్నారనే వార్త తాజాగా బయటికొచ్చింది.
ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన 23 మంది అభ్యర్థులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వీరిలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతలతో పాటు ఓ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరితో జిల్లాలోని నేతలతో పాటు వైసీపీలోని కీలక నేత ఒకరు సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడానికి కారణం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలేనని సమాచారం. ఇటీవల వెలువడిన ఫలితాల్లో మెజారిటీ సంస్థలు ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తేల్చాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీలోని కొందరు నేతలు ముందుగానే వైసీపీ నేతలతో మంతనాలు జరిపారనే వార్త రాష్ట్రంలో హాట్ టాపిక్ అవగా, టీడీపీలో ఆందోళన కలిగిస్తోంది.
వాస్తవానికి ఎన్నికలకు ముందే వీళ్లంతా వైసీపీలోకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకున్నారని, అయితే.. అప్పుడు వీలు కాకపోవడంతో ఆగిపోయారనే టాక్ వినిపిస్తోంది. ఇక, టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవనే కారణంతోనే వీళ్లంతా తమ దారి తాము చూసుకోవాలనుకుంటున్నారని తెలిసింది. మరోవైపు, అధికార తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు అన్ని రకాల పింఛన్లను రెట్టింపు చేసింది. అంతేకాదు, అన్నదాత సుఖీభవ పేరిట రైతులను నగదు పంపిణీ చేయడం, పసుపు- కుంకుమ పథకం కింద డ్వాక్రా మహిళల ఖాతాలో డబ్బులు వేయడం, నిరుద్యోగ భృతి వంటివి చేసింది. కానీ, ఓటర్లు ఆ పార్టీ వైపు చూడలేదనే ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.