Begin typing your search above and press return to search.

ఐసీయూలో ఉన్న 21 ఏళ్ల మహిళ పై అత్యాచారం .. !

By:  Tupaki Desk   |   29 Oct 2020 4:40 PM IST
ఐసీయూలో ఉన్న 21 ఏళ్ల మహిళ పై అత్యాచారం .. !
X
ఒళ్ళంతా మ‌ద‌మెక్కి క‌ళ్లు మూసుకుపోయిన ఓ కామాందుడు, పొగ‌రెక్కిన చేష్ట‌ల‌తో స‌భ్య స‌మాజం త‌ల దించుకునేల ప్ర‌వ‌ర్తించిన ఆ కామాందుడుకి ఎంత‌టి శిక్ష అమ‌లు చేసినా త‌క్కువే అని అంటున్నారు. ప్రాణం పోసే ప‌విత్ర‌మైన చోట ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మ‌హిళ‌ పై అత్యంత నీచంగా ప్రవర్తించాడు. ఇంత‌టి దారుణానికి ఒడిగ‌ట్టిన ఆ కామాంధుడికి ఎలాంటి శిక్ష వేసినా కూడా ఆ పాపం తీరిపోదు. ఇంతకీ ఆ నీచుడు చేసిన చేసిన హ్రుద‌య విదార‌క పని ఏమిటంటే .. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ 21 ఏళ్ల టీబీ పేషేంట్ పై అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఉందంతం ఇది. ఈ ఘటన హర్యానాలో జరిగింది.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. అసలు ఈ సమాజం లో ఉండే వారు ఎప్పటికి , ఏం చేస్తే మారతారో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. పసి పిల్లల నుండి ముసలివారి వరకు ఏ ఒక్క ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. మహిళల కోసం ఎన్నో చట్టాలు తీసుకువస్తున్నా కూడా అవేవి కూడా మహిళల మాన , ప్రాణాలని కాపాడలేకపోతున్నాయి. అలాగే కొందరు కామాందులకి పోలీసులు కూడా కఠిన శిక్షలు విదిస్తున్నా , వారిలో ఎటువంటి మార్పు రావడం లేదు. తాజాగా హర్యానా లోకి గురుగ్రామ్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 21 ఏళ్ల అమ్మాయి టీబీతో భాదపడుతూ , చికిత్స కోసం అడ్మిట్ అయింది. అయితే , వెంటిలేటర్ పై అపస్మారక స్థితిలో చికిత్స తీసుకుంటున్న ఆమె పై అత్యాచారం చేసారని పోలీసులు వెల్లడించారు. అయితే , ఇప్పటికే నిందుతుడుని గుర్తించామని ,అరెస్ట్ చేసి , కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు వెల్లడించారు.