Begin typing your search above and press return to search.

కుక్క జీవితం..లక్షలు సంపాదిస్తున్న 21 ఏళ్ల యువతి

By:  Tupaki Desk   |   18 July 2020 5:00 AM IST
కుక్క జీవితం..లక్షలు సంపాదిస్తున్న 21 ఏళ్ల యువతి
X
ప్రస్తుత రోజుల్లో కేవలం ఉద్యోగం చేస్తేనే సంపాదించగలం అని అనుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. మనలో ట్యాలెంట్ ఉండాలే కానే ఇంట్లో ఉండే కోట్లు సంపాదించవచ్చు. క్రియేటీవ్ ఐడియా మీ జీవితాన్ని మార్చేయచ్చు. డబ్బుల సంపాదన కంటే ముందు సోషల్ మీడియాలో బోలెడంత అభిమానం సంపాదించుకోవాలి. అయితే, ఇది అనుకున్నంత సులభమైన పనికాదు. ముఖ్యంగా అబ్బాయిలకు మరీ కష్టం. సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్లు అమ్మాయిలకే లభిస్తారు. వారు ఎంత చెత్త వీడియోలు పెట్టినా లైక్స్ లక్షల్లో వస్తాయి. ఈ యువతి వీడియోలు కూడా అలాంటివే. ఒకరకంగా చెప్పాలంటే.. ఈమెది కుక్క జీవితం. అయితే ఆ కుక్క జీవితమే ఇప్పుడు ఆమెకి లక్షలు తెచ్చి పెడుతుంది.

పూర్తి వివరాలు చూస్తే .. టిక్‌ టాక్ స్టార్ 21 ఏళ్ల జిన్నా పిలిప్స్ తనని తాను కుక్క పిల్లలా భావిస్తోంది. అచ్చం కుక్కలాగే ప్రవర్తిస్తూ ఇప్పుడు అందరి దృష్టిని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు టిక్ టాక్ లో ఈమె చేసిన వీడియోలో ఒక్కసారిగా కూడా మనిషిలా ప్రవర్తించలేదు. కుక్కలాగే నడుస్తూ.. పాకుతూ.. నీళ్లు తాగుతూ.. ఆటలాడుతూ.. తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటోంది. అందం, ఆకర్షనీయమైన రూపం ఉన్న జిన్నాను చూసి నెటిజనులు ఫిదా అవుతున్నారు. ఆమెకు డబ్బులు చెల్లించి మరీ వీడియోలు చూస్తున్నారు.

ఆలా ఈ టిక్ టాక్ స్టార్..నెలకు అక్షరాలా లక్షలాది రూపాయలు సంపాదిస్తుంది. ఈ కారణంతో ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా కుక్కలా మారిపోయింది. కుక్కలా జీవిస్తూ.. కుక్క చేష్టలతో నెటిజనులకు బోలెడంత వినోదం పంచుతోంది. ఈమె కుక్క చేష్టలు ఆమెను రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మార్చేసింది. ఈ వీడియోలు చూస్తే మీరు కూడా ఫిదా అవుతారు. ఇప్పటివరకు ఆమెకు ‘టిక్‌టాక్‌‌‌లో 1,20,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ వీడియోలు చూసేందుకు వారు నెలకు రూ.1,501 చొప్పున చెల్లిస్తున్నారు. కొందరైతే రూ.75 వేలు చెల్లించేందుకు కూడా సిద్ధమవుతున్నారట.