Begin typing your search above and press return to search.

ఉత్త‌రాఖండ్ విల‌యంః 204 మంది జాడ లేదు.. ఇద్ద‌రు బ‌తికొచ్చారు!

By:  Tupaki Desk   |   12 Feb 2021 7:00 PM IST
ఉత్త‌రాఖండ్ విల‌యంః 204 మంది జాడ లేదు.. ఇద్ద‌రు బ‌తికొచ్చారు!
X
ఉత్తరాఖండ్ లో ఇటీవ‌ల‌ వ‌ర‌దలు బీభ‌త్సం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఛమోలీ జిల్లాలో ధౌలిగంగా నది ఉగ్ర రూపం దాల్చ‌డంతో.. ఆ జలప్రళయానికి ధ‌న‌, ప్రాణ న‌ష్టం అధికంగా సంభ‌వించింది. ఈ వంద‌ల మంది గ‌ల్లంతు కాగా.. ఇప్పటివరకు 31 మంది చ‌నిపోయిన‌ట్టుగా అధికారులు గుర్తించారు.

ఈ వార‌ద‌ల్లో హైడ‌ల్ ప్రాజెక్టు కొట్టుకుపోయిన విష‌యం తెలిసిందే. ఒక్క‌సారిగా ముంచెత్తిన వ‌ర‌ద‌ల్లో ఈ ప్రాజెక్టుకోసం ప‌నిచేస్తున్న వారంతా మునిగిపోయారు. ఈ ప్ర‌మాదం జ‌రిగి ఇప్ప‌టికి ఆరు రోజులు గ‌డిచాయి. ఈ జ‌ల ఖ‌డ్గం ధాటికి ఆచూకీ లేకుండా పోయిన వారి సంఖ్య మొత్తం 204 మందిగా అధికారులు నిర్ధారించారు. హైడల్‌ ప్రాజెక్టు తపోవన్ సొరంగంలో చిక్కుకున్నవారికోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

కాగా.. ఈ వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న వారిలో ఇద్దరు ప్రాణాల‌తో బయట పడ్డారు. ఇంకా ఎవ‌రైనా ప్రాణాల‌తో ఉన్నారేమోన‌ని.. వేగంగా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఆ సొరంగం వద్ద సహాయ కార్య‌క్ర‌మాలు మరింత ముమ్మరం చేసినట్లు చమోలి జిల్లా కలెక్టర్‌ స్వాతి భదోరియా వెల్ల‌డించారు.

అయితే.. ఈ దారుణ వ‌ర‌ద‌ల‌కు కార‌ణం.. మంచు కొండ‌లు కాద‌ని స్థానికులు చెబుతున్నార‌ట‌! దాదాపు 50 సంవ‌త్స‌రాల క్రితం అక్క‌డి నందాదేవి శిఖరంపై ఓ రేడియో యాక్టివ్ పరికరాన్నిఅధికారులు ఏర్పాటు చేశారట‌. ఈ ప్ర‌మాదానికి ఆ ప‌రిక‌రం పేల‌డ‌మే కార‌ణం కావొచ్చ‌ని వారు అనుమానిస్తున్నారు.