Begin typing your search above and press return to search.

2011 ఫైనల్ పై విచార‌ణకు ర‌ణ‌తుంగ డిమాండ్‌!

By:  Tupaki Desk   |   14 July 2017 7:24 PM IST
2011 ఫైనల్ పై విచార‌ణకు ర‌ణ‌తుంగ డిమాండ్‌!
X
మాజీ క్రికెట‌ర్ అర్జున ర‌ణ‌తుంగ‌ శ్రీ‌లంక జ‌ట్టుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త్ ఆతిథ్య‌మిచ్చిన 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌ మ్యాచ్ లో శ్రీలంక ఫిక్సింగ్ కు పాల్ప‌డిందని వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని కోరాడు. ఆ మ్యాచ్ పై త‌న‌కు అనుమానాలున్నాయ‌న్నాడు. ఈ విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ ర‌ణ‌తుంగ‌ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియో వైర‌ల్ అయింది.

ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో భార‌త్ , శ్రీ‌లంక మ్యాచ్ జ‌రుగుతున్న‌పుడు తాను కామెంట‌రీ చేస్తున్నాన‌ని, శ్రీలంక ఓట‌మి త‌న‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింద‌ని ర‌ణ‌తుంగ తెలిపాడు. అయితే, ఈ ఓట‌మి త‌న‌కు బాధ క‌లిగించింద‌ని, ఫైన‌ల్ మ్యాచ్ పై త‌న‌కు అనుమానాలున్నాయ‌ని అన్నాడు. అందుకే ఈ మ్యాచ్ పై విచార‌ణ జ‌రిపించాల‌ని కోరాడు. ఈ మ్యాచ్ గురించి ప్ర‌స్తుతం తానేమీ మాట్లాడ‌న‌ని, స‌మ‌యం వ‌చ్చిన‌పుడు అన్ని విష‌యాలు వెల్ల‌డిస్తాన‌ని అన్నారు.

ఈ అంశానికి సంబంధించి ర‌ణ‌తుంగా ఎవ‌రి పేర్ల‌ను బ‌య‌ట పెట్ట‌లేదు. కానీ, ఆట‌గాళ్లు త‌మ అస‌లు రంగును ఎక్కువ కాలం దాచ‌లేర‌ని వ్యాఖ్యానించారు. 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త్ చేతిలో ఓట‌మి పాలైన శ్రీ‌లంక జ‌ట్టు ఆట‌తీరుపై అనుమానాలు వ్య‌క్తం చేస్తూ స్థానిక మీడియాలో అనేక వార్త‌లు వ‌చ్చాయి. ఆ మ్యాచ్ లో శ్రీ‌లంక చెత్త‌గా ఫీల్డింగ్‌, బౌలింగ్ చేసింద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే, ర‌ణ‌తుంగ త‌ర‌హాలో మ్యాచ్ పై విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్లు రాలేదు.