Begin typing your search above and press return to search.

ఒమన్ బంపర్ ఆఫర్ .. ఇండియాకి రావడానికి సిద్ధమైన 2 వేల మంది !

By:  Tupaki Desk   |   8 Dec 2020 11:33 AM IST
ఒమన్ బంపర్ ఆఫర్ .. ఇండియాకి రావడానికి సిద్ధమైన 2 వేల మంది !
X
ఒమన్ ప్రభుత్వం .. ఈ మధ్య ఓ సరికొత్త సదావకాశాన్ని ప్రకటించింది. దేశంలో అక్రమంగా నివసించే వారికి , వారి దేశం వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. ఒమన్ సర్కార్ పెట్టిన గడువు లోపల దేశం దాటిపోతే ఎలాంటి అపరాధ రుసుము కూడా కట్టాల్సిన పనిలేదు. ఇందులో భాగంగానే ఎగ్జిట్ స్కీం ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్ లో ఎలాంటి జరిమానాలు చెల్లించకుండా దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు ఈ నెల 31 వరకు అవకాశం కల్పించింది.

దీనిలో భాగంగానే రెండు వేల మంది భారత ప్రవాసులు రిజిస్టర్ చేసుకున్నట్లు ఇండియన్ రాయబారి మును మహావర్ సోమవారం ప్రకటించింది. దీంతో చెల్లుబాటు అయ్యే పాస్‌ పోర్ట్ లేని సుమారు 500 మందికి ఎంబసీ అత్యవసర ప్రయాణ పత్రాలు జారీ చేసినట్లు రాయబారి తెలియజేశారు. కాబట్టి , వర్క్ పర్మిట్ గడువు ముగిసిన ప్రవాసులు ఉంటే.. ఒమన్ ప్రభుత్వం దేశం విడిచి పెట్టి వెళ్లేందుకు విధించిన డెడ్‌ లైన్ డిసెంబర్ 31 కంటే ముందే తమ పేరు నమోదు చేసుకోవాలని రాయబార కార్యాలయం ప్రకటించింది. అలాంటి వారి కోసం ఎంబసీ ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎలాంటి జరిమానాలు లేకుండా స్వదేశానికి వెళ్లిపోవాలని సూచించింది.