Begin typing your search above and press return to search.

20 సెకన్లు.. 10 కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత.. జస్ట్ ఊహించండి

By:  Tupaki Desk   |   30 Dec 2020 6:00 AM IST
20 సెకన్లు.. 10 కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత.. జస్ట్ ఊహించండి
X
భూమికి కొన్ని కోట్ల మైళ్ల దూరంలో ఉండే సూరీడు భగ్గుమంటే.. ప్రపంచం వణుకుతుంది. అలాంటి సురీడు దగ్గర ఎంతటి ఉష్ణోగ్రత ఉంటుందో.. అలాంటిదే ఒకటి భూమి మీద కృత్రిమంగా సృష్టిస్తే? నోట మాట రావటం లేదు కదా? నిజమే.. ఈ అద్భుత ప్రయోగం గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఊహకు అందరి రీతిలో అద్భుతాన్ని ఆవిష్కరించిన వైనం ఇప్పుడు పెనుసంచలనంగానే కాదు.. ప్రపంచ రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు కొరియన్లు.

న్యూక్లియర్ ఫ్యూజన్.. అణు కేంద్రకాలతో ఒకదానిలో మరొకటి లీనమయ్యే ప్రక్రియతో అనంతమైన శక్తి.. అంతకు మించిన వేడి.. వెలుతురును కృత్రిమంగా సృష్టించే ప్రయోగం తాజాగా నిర్వహించారు. 20 సెకన్ల పాటు 10 కోట్ల డిగ్రీల వేడిని క్రియేట్ చేయటం ద్వారా.. భూమి మీద ఒక కృత్రిమ స్యూర్యుడిని సృష్టించారు. ఈ ఘనతను దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు సాధించారు.

సాధారణంగా సూర్యుడిలో ఉష్ణోగ్రతలు 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్ కుపరిమితమవుతారు. అలాంటిది అందుకు ఆరేడు రెట్లు ఎక్కువ టెంపరేచర్ ను క్రియేట్ చేయటం తాజా ప్రయోగం ప్రత్యేకతగా చెప్పాలి. ఇంతకీ ఈ అద్భుతాన్ని సాధించింది ఎవరంటే దక్షిణ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ వర్సిటీ సభ్యులు. వీరికి అమెరికాకు చెందిన కొలంబియా వర్సిటీ పరిశోధకులు సాయం అందించారు. వీరు.. ఇరువురు కలిసి ఈ అద్భుతాన్ని సాధించాయి.

తాజా ప్రయోగంతో పర్యావరణ రహిత ఇంధనాల డెవలప్ మెంట్ లో కీలక భూమిక పోషిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం అణు విచ్ఛేదనం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అయితే.. న్యూ క్లియర్ ఫిజన్ ను పారిశ్రామిక స్థాయిలో ఇప్పటివరకు వాడలేదు. తాజా ప్రయోగం దాన్ని అధిగమించింది. శాస్త్ర రంగంలో ఈ ప్రయోగం అద్భుతంగా అభివర్ణిస్తున్నారు.